చింపాంజితో ‘ఎఫైర్’ పెట్టుకున్న మహిళ.. ‘చేష్టలు’ హద్దు మీరడంతో నిషేధం

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో కొన్ని వింత ఘటనలు జరిగినప్పుడు దాని గురించి విన్నా లేదా చూసినా.. ఔరా..! ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. ఆ తర్వాత విషయం పూర్తిగా తెలుసుకున్నాక గానీ మనసు కుదుటపడదు. ఇలాంటి ఘటనలు ప్రపంచంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉండగా.. కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా వెలుగుచూసిన ఓ విషయం మాత్రం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అదేంటంటే ఓ మహిళ చింపాంజితో ‘ఎఫైర్’ పెట్టుకోవడమే. సాధారణంగా ఈ ప్రపంచంలో జంతు ప్రేమికులు, […]

Update: 2021-08-23 10:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో కొన్ని వింత ఘటనలు జరిగినప్పుడు దాని గురించి విన్నా లేదా చూసినా.. ఔరా..! ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. ఆ తర్వాత విషయం పూర్తిగా తెలుసుకున్నాక గానీ మనసు కుదుటపడదు. ఇలాంటి ఘటనలు ప్రపంచంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉండగా.. కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా వెలుగుచూసిన ఓ విషయం మాత్రం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అదేంటంటే ఓ మహిళ చింపాంజితో ‘ఎఫైర్’ పెట్టుకోవడమే.

సాధారణంగా ఈ ప్రపంచంలో జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు చాలా మందే ఉన్నారు. వారంతా పర్యావరణం, జంతువులు, పక్షుల బాగోగుల కోసం వారి జీవితంలో అధిక భాగం వెచ్చిస్తుంటారు. వాటికి దగ్గరగా ఉంటూ కొత్త అనుభూతిని పొందుతారు. ప్రకృతి అందాల వీక్షణలో కొందరు, జంతువులు తమపై చూపే ప్రేమలో మునిగిపోయి తమను తాము మర్చిపోతారు. కానీ, జంతువులతో ఎఫైర్ పెట్టుకోవడం అనేది ప్రకృతి విరుద్ధంగా కొందరు వాదిస్తున్నారు.

బెల్జియంకు చెందిన ఓ మహిళ ‘ఆది టిమ్మర్ మన్స్’ జంతు ప్రేమికురాలు. రెగ్యులర్‌గా ‘జూ’కు వెళ్తుండేది. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ‘చిటా’ అనే 38 ఏళ్ల చింపాంజితో ప్రేమలో పడింది. దానికోసం ప్రతీవారం ‘యాంట్ వెర్ప్ జూ’ కు వెళ్లేది. ఆ చింపాంజి కూడా ఈ మహిళ తరచూ జూ కు రావడాన్ని గమనించేది. కొద్దిరోజుల తర్వాత ఇద్దరి మధ్య ఓ కమ్యూనికేషన్ ఏర్పడింది. దీంతో చిటా, టిమ్మర్‌మన్స్ ఒకరినొకరు చూసుకుంటూ.. గ్లాస్ ఎన్ క్లోజర్ ఎదురుగా నిలబడి ‘హాయ్, బాయ్’ చెప్పుకుంటూ ఉండేవారు. సైగలతో సంభాషించుకునే వారు. ఆ తర్వాత చేతులు ఊపుతూ గాల్లో ‘ముద్దులు’ కూడా పెట్టుకునే వారు. ఇలాగే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే, నెమ్మదిగా చింపాంజిలో మార్పులు రావడం గమనించిన జూ సిబ్బంది దానికి కారణం టిమ్మర్ మన్స్ అని గుర్తించారు. ఆమెను ఓ రోజు ఆపి ప్రశ్నించగా.. మా ఇద్దరి మధ్య ‘ఎఫైర్’ నడుస్తుందని చెప్పింది. దీంతో ఆమె మళ్లీ ‘జూ’ కు రాకుండా అధికారులు నిషేధం విధించారు. ఎంతో మంది సందర్శకులు ‘జూ’ కు వచ్చి జంతువులను వీక్షించినప్పుడు తాను ఎందుకు రాకూడదని ఆమె గట్టిగా వాదించడంతో సిబ్బంది అక్కడి నుంచి పంపించివేశారు.

ఈ విషయంపై జూ అధికారులు స్పందిస్తూ.. జంతువులపై మనుషులు ఎక్కువ అప్యాయతగా, ప్రేమగా మెలిగినా అవి వింతగా ప్రవర్తిస్తాయని, వారితో తప్ప.. ఇతర జంతువులతో కలిసి ఉండలేవని చెప్పారు. ఇంట్లో పెంచుకునే జంతువులు వేరు అని.. కానీ, జూ లోని జంతువులపై ఈ అప్యాయతలు, ప్రేమలు వాటికి ‘చేటు’ చేస్తాయన్నారు. ‘‘చిటా సందర్శకులతో నిరంతరం బిజీగా ఉన్నప్పుడు, ఇతర చింపాంజిలు దానిని పట్టించుకోవు.. గుంపులో భాగంగా పరిగణించవు. చిటా సందర్శకులతో ప్రేమగా మెలిగిన సమయంలో గుంపును వదిలేసి వెలుపల తనంతట తాను ఒంటరిగా కూర్చుంటాడు’’ అని జూ అధికారులు వివరించారు. ఇది ఇలాగే కొనసాగితే చిటా పై పెను ప్రభావం చూపుతుందనే కారణంతోనే ఆ మహిళపై నిషేధం విధించినట్టు పేర్కొన్నారు.

Tags:    

Similar News