లాడ్జిలో విదేశీ యువతులతో వ్యభిచారం.. ముఠా అరెస్ట్ 

దిశ, క్రైమ్ బ్యూరో: ప్రతి నెలా రూ.75 వేలు అద్దె చెల్లిస్తూ ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు ముఠాల గుట్టురట్టు చేశారు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసులు. రాచకొండ కమిషనరేట్ ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిదుర్గా లాడ్జిని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన దేశినేని వెంకటేశ్వరరావు ఫిబ్రవరి నుంచి నెలకు రూ.75 వేలు అద్దె చెల్లించేలా లీజుకు తీసుకున్నాడు. డబ్బును తేలికగా సంపాదించేందుకు వ్యభిచారం నడిపించాలని భావించాడు. తెలిసిన కస్టమర్లను సంప్రదిస్తూ లాడ్జిలోని […]

Update: 2021-03-17 09:38 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: ప్రతి నెలా రూ.75 వేలు అద్దె చెల్లిస్తూ ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు ముఠాల గుట్టురట్టు చేశారు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసులు. రాచకొండ కమిషనరేట్ ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిదుర్గా లాడ్జిని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన దేశినేని వెంకటేశ్వరరావు ఫిబ్రవరి నుంచి నెలకు రూ.75 వేలు అద్దె చెల్లించేలా లీజుకు తీసుకున్నాడు. డబ్బును తేలికగా సంపాదించేందుకు వ్యభిచారం నడిపించాలని భావించాడు. తెలిసిన కస్టమర్లను సంప్రదిస్తూ లాడ్జిలోని గదులలో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఒక్కొక్క కస్టమర్ నుంచి రూ.5 వేలు తీసుకుంటూ.. బాధిత మహిళలకు మాత్రం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పశ్చిమ బెంగాల్కు‌ చెందిన సాకిజాన్ అలియాస్ దీపిక అలియాస్ రేష్మా (30) ఇదే లాడ్జిలో కొన్ని గదులను అద్దెకు తీసుకుని ఆమె సైతం వ్యభిచారాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తోంది.

బంగ్లాదేశ్ యువతులతో పాటు.. పశ్చిమ బెంగాల్, ఏపీకి చెందిన యువతులను వ్యభిచారానికి ఏర్పాటు చేస్తోంది. రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసులు విశ్వసనీయ సమాచారం అందుకుని బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా నలుగురు ఆర్గనైజర్లతో పాటు నలుగురు విటులను, నలుగురు బాధిత మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఆర్గనైజర్ పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో రిమాండ్ చేసినట్టు రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం అడిషనల్ డీసీపీ సురేందర్ తెలిపారు.

 

 

Tags:    

Similar News