ఆ నొప్పికి మందిస్తానని మహిళపై ఘోరం.. చివరికి అతడి దుస్థితి ఏమైందంటే..?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడం లేదు. మంచిగా మాట్లాడుతున్నారని మాట కలిపితే.. వారే మోసం చేస్తున్నారు. ఇక మహిళలకు మాయమాటలు చెప్పి దారుణాలకు ఒడిగట్టే కీచకుల గురుంచి అందరికి తెలిసిందే. తాజాగా కూలిపనులు కోసం వచ్చిన ఒక మహిళకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఎక్కడ ఆమె బయటకి వెళ్లి నిజం చెప్తుందో అని గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఇక ఇంతటి […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడం లేదు. మంచిగా మాట్లాడుతున్నారని మాట కలిపితే.. వారే మోసం చేస్తున్నారు. ఇక మహిళలకు మాయమాటలు చెప్పి దారుణాలకు ఒడిగట్టే కీచకుల గురుంచి అందరికి తెలిసిందే. తాజాగా కూలిపనులు కోసం వచ్చిన ఒక మహిళకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఎక్కడ ఆమె బయటకి వెళ్లి నిజం చెప్తుందో అని గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఇక ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి, జైల్లో తిండిపెడతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు పోలీసులను అడ్డుకొని నిందితుడిని నడిరోడ్డుపై కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి(42) కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇటీవలే కూలిపనుల కోసం వుడ్డెపాలెం వచ్చింది. అక్కడ అదే గ్రామానికి చెందిన వల్లెపు ఓబయ్య(51) ఆమెకు పరిచయమయ్యాడు. అతడి సాదరాబాధకాలు చెప్తుండడంతో ఆమె కూడా తన కీళ్ల నొప్పులు గురించి తెలిపింది. దీంతో నొప్పులకు మందు ఉందని ఆమెకు మాయమాటలు చెప్పి.. పక్కనే ఉన్న గుడిసెలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే తన పరువు పోవడంతో పాటు బయట ఇబ్బందులు ఎదురవతాయని భావించిన ఓబయ్య గట్టిగా అరుస్తున్న విజయలక్ష్మిపై దాడి చేసి గొడ్డలితో ఆమెను అతి కిరాతకంగా నరికి చంపాడు.
ఇక ఈ విషయం తెలుసుకున్న ఓబయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఓబయ్యను అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ ని ఖండించిన గ్రామస్థులు ఆగ్రహంతో పోలీస్ వ్యాన్ ను అడ్డుకుని ఓబయ్యపై దాడికి దిగారు. అతడిని కొట్టికొట్టి చంపారు. అడ్డు వచ్చినందుకు పోలీసులపై కూడా గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. నిందితుడిని గ్రామస్థులు దాడిచేసి హతమారుస్తుంటే.. చివరికి పోలీసులు కూడా ఏమి చేయలేకపోయారు. ప్రస్తుతం ఈ ఘటన ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది.