మృతదేహాన్ని భుజాలపై మోసిన మహిళా ఎస్ఐ

దిశ, వెబ్‌డెస్క్ : కఠినంగా కనిపించే ఖాకీల హృదయం కూడా చలిస్తదనడానికి ఆమె ఓ ఉదాహరణ. తప్పు చేస్తే తాట తీసే కర్కషత్వం ఉన్నా.. కష్టాల్లో ఉన్న వారిని, అభాగ్యులను చేరదీయడానికి మంచి మనసు, మానవత్వం ఉంటుందని నిరూపించిందీ ధీర వనిత. డ్యూటీ నిర్వహణలో స్త్రీ, పురుష భేదం లేకుండా ముందుండి సేవ చేసిందీ ఇన్ స్పెక్టర్ శిరీష. ఇంతకూ ఆమె ఏం చేసిందంటే.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తోంది శిరీష. సోమవారం ఉదయం […]

Update: 2021-02-01 07:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కఠినంగా కనిపించే ఖాకీల హృదయం కూడా చలిస్తదనడానికి ఆమె ఓ ఉదాహరణ. తప్పు చేస్తే తాట తీసే కర్కషత్వం ఉన్నా.. కష్టాల్లో ఉన్న వారిని, అభాగ్యులను చేరదీయడానికి మంచి మనసు, మానవత్వం ఉంటుందని నిరూపించిందీ ధీర వనిత. డ్యూటీ నిర్వహణలో స్త్రీ, పురుష భేదం లేకుండా ముందుండి సేవ చేసిందీ ఇన్ స్పెక్టర్ శిరీష. ఇంతకూ ఆమె ఏం చేసిందంటే..

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తోంది శిరీష. సోమవారం ఉదయం కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం ఉందని ఆమెకు సమాచారం అందింది. ఘటన స్థలానికి వెళ్లిన ఆమె.. మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాటు చేసింది. అయితే స్థానికులు వృద్ధుడి మృతదేహాన్ని మోసేందుకు నిరాకరించారు. దీంతో ఎస్ఐ శిరీష స్వయంగా వృద్ధుడి మృతదేహాన్ని స్ట్రేచర్‌పై వేసుకోని మరొకరి సాయంతో శవాన్ని భుజాలపై మోసింది. అలా కిలోమీటరుకుపైగా పొలం గట్ల మీదుగా రహదారి వరకు మోసుకొచ్చి లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు అప్పగించింది. అనంతరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఉద్యోగ నిర్వహణలో ఎస్ఐ శిరీష చూపిన చొరవకు ఉన్నతాధికారులు ఫిదా అయ్యారు. ఆమెకు పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచే కాకుండా ప్రజల నుంచి విశేషంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News