కూకట్​పల్లిలో మహిళ అదృశ్యం

దిశ, కూకట్​పల్లి: భర్త బయటికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో నుంచి మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన కూకట్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్​పల్లి గ్రామంలోని రామాలయం వీధిలో నివాసం ఉంటున్న విరిగినేని మాల్యాద్రి అనే వ్యక్తి ఈ నెల 25వ తేదిన ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లి మద్యహ్నం 3 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చాడు. అతడు వచ్చేసరికి అతడి భార్య విరిగినేని రత్తమ్మ ఇంట్లో […]

Update: 2021-10-29 11:18 GMT

దిశ, కూకట్​పల్లి: భర్త బయటికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో నుంచి మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన కూకట్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్​పల్లి గ్రామంలోని రామాలయం వీధిలో నివాసం ఉంటున్న విరిగినేని మాల్యాద్రి అనే వ్యక్తి ఈ నెల 25వ తేదిన ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లి మద్యహ్నం 3 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చాడు. అతడు వచ్చేసరికి అతడి భార్య విరిగినేని రత్తమ్మ ఇంట్లో లేదు. చుట్టు పక్కల తెలిసిన వారి వద్దకు వెళ్లి గాలించినా ఫలితం లేదు. దాంతో అతడు శుక్రవారం కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాల్యాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్​ కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు రతమ్మ కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News