మహిళను ఆది పరాశక్తిగా కొలిచారు..
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : భారతీయ సంస్కృతిలో మహిళను ఒక ఆదిపరాశక్తిగా కొలిచారని ప్రముఖ ఆధ్యాత్మిక గాయని ప్రతిమ శశిధర్ అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేకంగా మహిళా దినోత్సవం నిర్వహించడం మూలంగా వారిని ఎలా గౌరవించాలి, వారి పట్ల ఎలా వ్యవహరించాలి.. అనే అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడంతో సమాజంలో కొంత మార్పు తేవచ్చు అని అన్నారు. అయితే ఈ మార్పు ఇంటి నుండే మొదలు కావాలని చెప్పారు. ఎప్పుడైతే మహిళలు మగవారితో సమానంగా ఆర్ధికంగా […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : భారతీయ సంస్కృతిలో మహిళను ఒక ఆదిపరాశక్తిగా కొలిచారని ప్రముఖ ఆధ్యాత్మిక గాయని ప్రతిమ శశిధర్ అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేకంగా మహిళా దినోత్సవం నిర్వహించడం మూలంగా వారిని ఎలా గౌరవించాలి, వారి పట్ల ఎలా వ్యవహరించాలి.. అనే అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడంతో సమాజంలో కొంత మార్పు తేవచ్చు అని అన్నారు.
అయితే ఈ మార్పు ఇంటి నుండే మొదలు కావాలని చెప్పారు. ఎప్పుడైతే మహిళలు మగవారితో సమానంగా ఆర్ధికంగా నిలదొక్కుకుని జీవిస్తోరో అప్పుడు ప్రతి రోజు మహిళా దినోత్సవమే అవుతుందన్నారు . మహిళలకు ఆర్ధిక స్వాతంత్ర్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగం చేయడం చదివిన చదువుకు సార్థకత మాత్రమే కాదని, అన్ని రంగాలలో రాణించడమే అసలైన సార్థకత అని తెలిపారు.