'గే‘ను పెళ్లాడిన యువతి.. శోభనం రాత్రి ముప్పుతిప్పలు పడ్డ వరుడు.. అయినా..

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా సంబంధం.. కుర్రాడు చక్కగా ఉన్నాడు.. కూతురు సంతోషంగా ఉంటుంది అని అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కూతురు సంతోషం  కన్న తమకేం కావాలనుకొని రూ. 10 లక్షల కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లిచేశారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదని వారికి ఆ సమయంలో తెలియలేదు.  తాను గే అని చెప్పకుండా పెళ్లి చేసుకొని, అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై ఓ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన […]

Update: 2021-06-09 05:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా సంబంధం.. కుర్రాడు చక్కగా ఉన్నాడు.. కూతురు సంతోషంగా ఉంటుంది అని అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కూతురు సంతోషం కన్న తమకేం కావాలనుకొని రూ. 10 లక్షల కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లిచేశారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదని వారికి ఆ సమయంలో తెలియలేదు. తాను గే అని చెప్పకుండా పెళ్లి చేసుకొని, అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై ఓ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన గుంటూరు జిలాల్లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..

తెనాలి సమీపంలోని పినపాడుకు చెందిన 20 ఏళ్ల యువతికి విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ప్రైవేటు కన్సల్టెన్సీలో పనిచేసే యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీన తెనాలిలో వివాహం జరిగింది. త్వరలోనే కెనడాకు వెళ్ళబోతున్న ఆ యువకుడు తన కూతుర్ని కూడా తీసుకెళ్తాడని అనుకున్న వధువు తల్లిదండ్రులు అతనితో సుమారు రూ.10 లక్షల కట్నం, ఇతర లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి వివాహం చేశారు. ఇక ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి అడుగుపెట్టిన భార్యకు, భర్త తాను గే నని, తనకు ఆడవారు ఇష్టం ఉందని చెప్పడంతో ఖంగు తిన్నది. కట్నం కోసం, ఇంట్లో బలవంతం వలన పెళ్లి చేసుకొన్నానని, బయట ఎవరికి ఈ విషయం చెప్పొద్దని బతిమిలాడాడు. మరుసటి రోజు విజయవాడలో వరుడి తల్లిదండ్రులు రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

ఇక రిస్పెషన్ లో వధువు ఆమెకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు తెలిపి భోరున విలపించింది. ఇక విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు వరుడి కుటుంబంపై దాడికి దిగి వధువు తల్లిదండ్రులు తమ కుమార్తెను తెనాలిలోని పుట్టింటికి తీసుకొచ్చేశారు. అనంతరం ఇరుపక్షాల పెద్దలు పలుమార్లు సంప్రదింపులు జరిపగా వరుడు కుటుంబ సభ్యులు రిసెప్షన్‌ కోసం తాము రూ.8 లక్షలు ఖర్చు పెట్టామని, వాటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పలుమార్లు వారు వధువు కుటుంబంపై దాడికి పాల్పడడంతో వధువు కుటుంబ సభ్యులు తెనాలి త్రీ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News