మహిళ దారుణ హత్య.. గాజు పెంకుతో గొంతుకోసి..

దిశ, వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. వివరాల ప్రకారం.. మోర్తాడ్ మండల కేంద్రంలో 63వ జాతీయ రహదారి పక్కన ఉన్న కుందేలు గుట్టపై మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాజు పెంకుతో మహిళ గొంతుకోసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆర్మూర్​ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని […]

Update: 2021-03-27 10:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. వివరాల ప్రకారం.. మోర్తాడ్ మండల కేంద్రంలో 63వ జాతీయ రహదారి పక్కన ఉన్న కుందేలు గుట్టపై మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాజు పెంకుతో మహిళ గొంతుకోసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆర్మూర్​ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

 

Tags:    

Similar News