ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి
దిశ వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. మొన్నటివరకు దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలను మళ్లీ అమలు చేస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఈ […]
దిశ వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. మొన్నటివరకు దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలను మళ్లీ అమలు చేస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చేవారికి ఈ పాస్ తప్పనిసరి చేస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీ, పుదుచ్చేరి నుంచి వచ్చేవారికి ఈ పాస్ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది.
కాాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజూ 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా మళ్లీ కరోనా సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది.