ఐపీఎల్‌ రద్దైతే బీసీసీఐకి కష్టమే

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 సీజన్‌లో 29 మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత కరోనా కారణంగా లీగ్ వాయిదా పడింది. మిగిలిన సీజన్ పూర్తి చేయడానికి ఇంగ్లాండ్, యూఏఈ దేశాల క్రికెట్ బోర్డులతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతున్నది. ఇప్పటికీ ఐపీఎల్ పూర్తి చేస్తామని ఆశాభావంతోనే బీసీసీఐ ఉన్నది. ఒక వేళ రద్దయితే మాత్రం బీసీసీఐ భారీగా నష్టపోవడం ఖాయమనే మాట వినిపిస్తున్నది. ఇప్పటికే ఐపీఎల్ రద్దు వల్ల్ రూ. 2500 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని బీసీసీఐ […]

Update: 2021-05-20 11:15 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 సీజన్‌లో 29 మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత కరోనా కారణంగా లీగ్ వాయిదా పడింది. మిగిలిన సీజన్ పూర్తి చేయడానికి ఇంగ్లాండ్, యూఏఈ దేశాల క్రికెట్ బోర్డులతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతున్నది. ఇప్పటికీ ఐపీఎల్ పూర్తి చేస్తామని ఆశాభావంతోనే బీసీసీఐ ఉన్నది. ఒక వేళ రద్దయితే మాత్రం బీసీసీఐ భారీగా నష్టపోవడం ఖాయమనే మాట వినిపిస్తున్నది. ఇప్పటికే ఐపీఎల్ రద్దు వల్ల్ రూ. 2500 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. ఫ్రాంచైజీలు, బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కూడా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఎదురు కానున్నది. కాగా, బీసీసీఐతో సహా ఏ ఫ్రాంచైజీ కూడా ఇన్స్యూరెన్స్ తీసుకోలేదని సమాచారం. కేవలం ఆటగాళ్ల వేతనాలపై మాత్రమే ఆయా ఫ్రాంచైజీలు బీమా చేయించాయి.

ఏదైనా కారణాలతో ఆటగాడు ఐపీఎల్ ఆడలేకపోయినా.. అతడికి పూర్తి వేతనం చెల్లించేలా బీమా చేయించారు. కానీ ఐపీఎల్ రద్దయితే జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎలాంటి బీమా చేయించలేదు. వింబుల్డన్ నిర్వాహకులు ఆ టోర్నీకి పూర్తి స్థాయి ఇన్స్యూరెన్స్ చేయించారు.దీంతో గత ఏడాది టోర్నీ నిర్వహించకపోయినా ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్‌కు బీమా డబ్బులు వచ్చాయి. దీంతో భారీ నష్టాలు ఏవీ వింబుల్డన్ నిర్వాహకులు చూడలేదు. కానీ ఐపీఎల్‌కు ఇలాంటి బీమాలు ఏవీ లేవు. దీంతో మెగా లీగ్ జరిగితే తప్ప రద్దయితే మాత్రం బీసీసీఐ భారీ నష్టాలను ఎదుర్కోక తప్పదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News