విప్రో రూ. 9,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల బైబ్యాక్!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో సుమారు రూ. 9,500 కోట్ల బైబ్యాక్‌ను మంగళవారం(29న) ప్రారంభించనుంది. ఇది జనవరి 11 వరకు ఉంటుంది. ఈ మేరకు షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించేందుకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ నుంచి ఈ నెల 22న అనుమతి కూడా లభించింది. ఇందులో భాగంగా కంపెనీ మొత్తం 23.75 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఒక్కో షేర్‌కు రూ. 400 వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. ఇటీవలే మరో ఐటీ దిగ్గజం […]

Update: 2020-12-27 07:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో సుమారు రూ. 9,500 కోట్ల బైబ్యాక్‌ను మంగళవారం(29న) ప్రారంభించనుంది. ఇది జనవరి 11 వరకు ఉంటుంది. ఈ మేరకు షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించేందుకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ నుంచి ఈ నెల 22న అనుమతి కూడా లభించింది. ఇందులో భాగంగా కంపెనీ మొత్తం 23.75 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఒక్కో షేర్‌కు రూ. 400 వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. ఇటీవలే మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించింది. దీనికోసం రూ. 16 వేళ కోట్లను వెచ్చిస్తూ, వచ్చే ఏడాది జనవరి 1 వరకు కొనసాగించనుంది.

ఈ బైబ్యాక్‌లో భాగంగా టీసీఎస్ ఒక్కో షేర్‌కు రూ. 3000కి మాత్రమే కొనుగోలు చేయనుంది. విప్రో వాటాదారులు నవంబర్‌లోనే షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను ఆమోదించారు. కాగా, 2019లో కూడా విప్రో 32.31 కోట్ల షేర్లను ఒక్కో షేర్‌కు రూ. 335 చొప్పున బైబ్యాక్‌ను చేపట్టింది. ఈ బైబ్యాక్ మొత్తం విలువ రూ. 10,500 కోట్లు. ఇదిలా ఉండగా, బైబ్యాక్ ఆఫర్ నేపథ్యంలో గతవారాంతం విప్రో షేర్ ధర రూ. 3.75 తగ్గి రూ. 381.80 వద్ద ముగిసింది.

Tags:    

Similar News