Today Gold Rate: ముచ్చటగా మూడో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. తులం గోల్డ్ రేట్ ఎంత ఉందంటే..?

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది.

Update: 2025-04-26 05:31 GMT
Today Gold Rate: ముచ్చటగా మూడో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. తులం గోల్డ్ రేట్ ఎంత ఉందంటే..?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,050 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.30 తగ్గి రూ.90,020 ఉంది. అలాగే నిన్న రూ.98,240 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరల పై ఈ రోజు రూ.30 తగ్గి రూ.98,210 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు మాత్రం కిలో రూ.1,10,900గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,020

24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,210

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,020

24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,210

Tags:    

Similar News