మందుబాబులకు గుడ్‌న్యూస్.. లాక్‌డౌన్‌లో వైన్స్ ఓపెన్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్‎డౌన్​ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఇక తెల్లారి లేవంగానే మద్యం దుకాణాల ఎదుట క్యూ కట్టాల్సి ఉంటుంది. లాక్​డౌన్​ కాలంలో వైన్స్‌లను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం […]

Update: 2021-05-11 04:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్‎డౌన్​ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఇక తెల్లారి లేవంగానే మద్యం దుకాణాల ఎదుట క్యూ కట్టాల్సి ఉంటుంది. లాక్​డౌన్​ కాలంలో వైన్స్‌లను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఏపీలో కూడా ఉదయమే మద్యం దుకాణాలను తెరుస్తున్నారు.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్​డౌన్​ ఖరారైంది. అయితే లాక్​డౌన్​లో నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలతో ఆదాయం తగ్గకుండా ఈ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఖరారు చేస్తోంది. పాలు, కూరగాయల దుకాణాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా ఉదయమే తెరిచి ఉంచుకోవాలని సూచిస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల తర్వాతే తెరుస్తుండగా… ఇప్పుడు ఉదయం 10 గంటల తర్వాత మూసివేయనున్నారు. ఇక మందుబాబులు లాక్​డౌన్​లో మద్యం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో లాక్​డౌన్​ ఉంటుందని చాలాచోట్ల నెలకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం లాక్​డౌన్​ నేపథ్యంలో మద్యం దుకాణాలకు వెసలుబాటు కల్పించింది.

Tags:    

Similar News