మందుకు వేళాయే.. క్యూ కట్టిన జనం!
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో ఎన్నికల సందర్భంగా గ్రేటర్‌లో మూతపడిన బార్లు, రెస్టారెంట్లు, మద్యం షాపులు మంగళవారం సాయంత్రం తెరచుకున్నాయి. అయితే, ఉదయం నుంచి మద్యం లేక అల్లాడిపోయిన మందుబాబులు వెంటనే వైన్స్ వద్ద క్యూ కట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఓటు వేసేందుకు ముందుకు రాని గ్రేటర్ వాసులు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లకు పరుగులు పెడుతుండటంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్పు కోసం గ్రేటర్ జనాలు కొంచెం […]
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో ఎన్నికల సందర్భంగా గ్రేటర్‌లో మూతపడిన బార్లు, రెస్టారెంట్లు, మద్యం షాపులు మంగళవారం సాయంత్రం తెరచుకున్నాయి. అయితే, ఉదయం నుంచి మద్యం లేక అల్లాడిపోయిన మందుబాబులు వెంటనే వైన్స్ వద్ద క్యూ కట్టినట్లు తెలుస్తోంది.
కాగా, ఓటు వేసేందుకు ముందుకు రాని గ్రేటర్ వాసులు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లకు పరుగులు పెడుతుండటంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్పు కోసం గ్రేటర్ జనాలు కొంచెం కూడా బాధ్యత చూపించకపోవడం దారుణమని నెటిజన్స్ మండిపడుతున్నారు. మరోవైపు పోలింగ్ శాతం తగ్గడంతో అటు పొలిటికల్ పార్టీలు, అభ్యర్థులు సైతం తలలు పట్టుకుంటున్నారు. తక్కువ ఓటింగ్ పర్సంటెజ్ తమ గెలుపుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చునని ఆందోళన చెందుతున్నారు.