ఎన్‌ఎఫ్‌టీగా వికీపీడియా ఫస్ట్ ఎడిట్ కాపీ
దిశ, ఫీచర్స్: వికీపీడియా కో ఫౌండర్, అమెరికన్ ఆంట్రప్రెన్యూర్ జిమ్మీ వేల్స్ తన తొలి ‘వికీ ఎడిట్ కాపీ’(వికీపీడియా తొలి సవరణ కాపీ)తో పాటు తను ఉపయోగించిన స్ట్రాబెర్రీ ఐమ్యాక్‌ను నాన్-ఫంజిబుల్ టోకెన్(NFTలు)గా విక్రయించేందుకు అక్షన్ కంపెనీ క్రిస్టీ తో జట్టు కట్టాడు. ‘ది బర్త్ ఆఫ్ వికీపీడియా’ పేరుతో డిసెంబర్ 3-15 వరకు ఆన్‌లైన్ సేల్ జరుగుతుండగా.. ఈ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగం వేల్స్‌కు చెందిన సోషల్ మీడియా నెట్‌వర్క్ WT.Socialకి […]
దిశ, ఫీచర్స్: వికీపీడియా కో ఫౌండర్, అమెరికన్ ఆంట్రప్రెన్యూర్ జిమ్మీ వేల్స్ తన తొలి ‘వికీ ఎడిట్ కాపీ’(వికీపీడియా తొలి సవరణ కాపీ)తో పాటు తను ఉపయోగించిన స్ట్రాబెర్రీ ఐమ్యాక్‌ను నాన్-ఫంజిబుల్ టోకెన్(NFTలు)గా విక్రయించేందుకు అక్షన్ కంపెనీ క్రిస్టీ తో జట్టు కట్టాడు. ‘ది బర్త్ ఆఫ్ వికీపీడియా’ పేరుతో డిసెంబర్ 3-15 వరకు ఆన్‌లైన్ సేల్ జరుగుతుండగా.. ఈ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగం వేల్స్‌కు చెందిన సోషల్ మీడియా నెట్‌వర్క్ WT.Socialకి విరాళంగా ఇవ్వనున్నాడు.
WT.Socialను ‘వికీ ట్రిబ్యూన్ సోషల్’ అని కూడా పిలుస్తారు. ఇది మైక్రోబ్లాగింగ్ అండ్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ కాగా ఇది నాన్ టాక్సిన్ కంటెంట్ అందిస్తుంది. అంతేకాదు వివిధ స్వచ్ఛంద సంస్థలకు మద్దతు ఇవ్వడంలోనూ ముందుంటుంది. 2001, జనవరి 15న వికీపీడియా ప్రారంభం కాగా వేల్స్ ఆ రోజున ఎడిట్ చేసిన తొలి కాపీని ప్రస్తుతం వేలం వేయనున్నారు. అదే సమయంలో వికీపీడియా వ్యాసాలు, పరిశోధన కోసం ఉపయోగించిన స్ట్రాబెర్రీ ఐమ్యాక్‌ను కూడా విక్రయించనున్నాడు.