భార్య సరదా తీరుద్దామని… చివరికి మృత్యువు ఇలా..
దిశ, వెబ్‌డెస్క్: తానొకటి తలిస్తే.. దైవమొకటి తలిచిందనే సామెత మీరు వినే ఉంటారు. మనం ఒకటి అవ్వాలనుకుంటే ఇంకేదో అవుతుంటూ ఉంటుంది. ఇలాంటి ఘటనే ఒక భర్తకు ఎదురైంది. సరదాగా భార్యకు గన్ చూపిద్దామనుకున్న ఒక భర్త ఉత్సాహం చివరికి విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన ఇవాళ విజయవాడలో చోటుచేసుకుంది. సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ అసిస్టెంట్ హోంగార్డ్‌గా వినోద్ పనిచేస్తున్నాడు. అయితే భార్య ముచ్చటపడటంతో.. ఆమె సరదా తీర్చేందుకు గన్ చూపిద్దామనుకున్నాడు. కానీ ఆ సరాదా […]
దిశ, వెబ్‌డెస్క్: తానొకటి తలిస్తే.. దైవమొకటి తలిచిందనే సామెత మీరు వినే ఉంటారు. మనం ఒకటి అవ్వాలనుకుంటే ఇంకేదో అవుతుంటూ ఉంటుంది. ఇలాంటి ఘటనే ఒక భర్తకు ఎదురైంది. సరదాగా భార్యకు గన్ చూపిద్దామనుకున్న ఒక భర్త ఉత్సాహం చివరికి విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన ఇవాళ విజయవాడలో చోటుచేసుకుంది.
సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ అసిస్టెంట్ హోంగార్డ్‌గా వినోద్ పనిచేస్తున్నాడు. అయితే భార్య ముచ్చటపడటంతో.. ఆమె సరదా తీర్చేందుకు గన్ చూపిద్దామనుకున్నాడు. కానీ ఆ సరాదా చివరికి విషాదంగా మారుతుందని అతడు ఊహించలేదు. గన్ చూపిస్తున్న క్రమంలో మిస్ ఫైర్ అయి భార్యకు తగిలింది.
ఈ ఘటనలో భార్య సూర్యరత్నప్రభ అక్కడిక్కడే మృతి చెందింది. భార్యకు సరదాగా గన్ చూపిద్దామనుకున్నానని, ఇలా అవుతుందని ఊహించలేదని భర్త వినోద్ ఆవేదన వ్యక్తం చేశాడు.