కొవిడ్ టీకాపై యూట్యూబ్ కొత్త పాలసీ.. ఏమిటంటే ?

దిశ, ఫీచర్స్ : కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలంతా కలిసి ‘వ్యాక్సిన్’ తీసుకురాగా, అన్ని దేశాల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తుండటంతో పాటు, దానిపై అపోహలు పెంచుకుంటున్నారు. ఇంకొంతమంది వ్యాక్సిన్ తీసుకోవద్దని, దాని వల్ల దుష్ప్రభావాలున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ -19కి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని కంట్రోల్ చేయడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తగినంత కృషి చేయలేదనే విమర్శల రావడంతో యూట్యూబ్ టీకాలకు వ్యతిరేకంగా […]

Update: 2021-10-04 02:34 GMT

దిశ, ఫీచర్స్ : కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలంతా కలిసి ‘వ్యాక్సిన్’ తీసుకురాగా, అన్ని దేశాల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తుండటంతో పాటు, దానిపై అపోహలు పెంచుకుంటున్నారు. ఇంకొంతమంది వ్యాక్సిన్ తీసుకోవద్దని, దాని వల్ల దుష్ప్రభావాలున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ -19కి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని కంట్రోల్ చేయడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తగినంత కృషి చేయలేదనే విమర్శల రావడంతో యూట్యూబ్ టీకాలకు వ్యతిరేకంగా వస్తున్న వీడియోలను తీసివేస్తున్నట్లు యూట్యూబ్ ఇటీవలే ప్రకటించింది.

కొవిడ్ -19 వ్యాక్సిన్ పాలసీలను ఉల్లంఘించినందుకు యూట్యూబ్ ఇప్పటికే 130,000 వీడియోలను తీసివేసింది. కొవిడ్ -19 టీకాలు ఆటిజం, క్యాన్సర్ లేదా వంధ్యత్వానికి కారణమవుతాయని లేదా వ్యాక్సిన్లలోని పదార్థాలు వాటిని స్వీకరించిన వారిని ట్రాక్ చేయగలవని చెప్పే ఎలాంటి కంటెంట్‌నైనా తీసివేస్తామని యూట్యూబ్ దాని కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌లో స్పష్టంగా వివరించింది. అంతేకాదు ఆమోదం పొందని టీకాలు ప్రమాదకరమైనవని, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలకు కారణమవుతాయని తెలిపే వీడియోలను, తప్పుడు సమాచారాన్ని కూడా డిలీట్ చేస్తోంది.

తొలిగించే సమాచారం :

* వైద్యుడిని సంప్రదించడం లేదా ఆసుపత్రికి వెళ్లడం వంటి వైద్య చికిత్స స్థానంలో.. హోమ్ రెమెడీస్, ప్రార్థన లేదా ఆచారాలను ఉపయోగించడాన్ని ప్రోత్సహించే కంటెంట్ తొలగిస్తుంది.
* కొవిడ్ -19కి గ్యారెంటీ నివారణ ఉందని పేర్కొన్న కంటెంట్
* కరోనా చికిత్స కోసం ఐవర్‌మెక్టిన్ లేదా హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని సిఫార్సు చేసే కంటెంట్
* మహమ్మారికి హైడ్రాక్సీక్లోరోక్విన్ సమర్థవంతమైన చికిత్స అని వాదనలు చేసే వీడియోలు
* వైద్య నిపుణుడిని సంప్రదించడం లేదా వైద్య సలహా తీసుకోవడం నుంచి ప్రజలను నిరుత్సాహపరిచే ఇతర కంటెంట్

Tags:    

Similar News