నా గురించి మాట్లాడకండి.. నేతలకు కేటీఆర్ ఫోన్
దిశ ప్రతినిధి, కరీంనగర్: నా రాజకీయ భవిష్యత్ గురించి ఎవరూ మాట్లాడకండి… ఇక అలాంటి ప్రకటనలకు దూరంగా ఉండండంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు పర్సనల్‌గా ఫోన్ చేసిన కేటీఆర్ బహిరంగ ప్రకటనలు చేయొద్దని కోరారు. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కేటీఆర్ ముఖ్యమంత్రి కావల్సిందేనని, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయంటు మీడియా ముందు కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ సీఎం కావాలన్న అభిప్రాయాలను పార్టీ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: నా రాజకీయ భవిష్యత్ గురించి ఎవరూ మాట్లాడకండి… ఇక అలాంటి ప్రకటనలకు దూరంగా ఉండండంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు పర్సనల్‌గా ఫోన్ చేసిన కేటీఆర్ బహిరంగ ప్రకటనలు చేయొద్దని కోరారు. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కేటీఆర్ ముఖ్యమంత్రి కావల్సిందేనని, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయంటు మీడియా ముందు కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ సీఎం కావాలన్న అభిప్రాయాలను పార్టీ ముఖ్య నేతలు, కీలక పదవుల్లో ఉన్నవారు చాలామంది కూడా బాహాటంగా కేటీఆర్ జపం చేపట్టారు. నిన్న మొన్నటి వరకు ఒకరిద్దరి నోట వినిపించగా రోజురోజుకు ఇలా మాట్లాడే. వారి సంఖ్య తీవ్రంగా పెరిగింది. అయితే గురువారం అనూహ్యంగా కేటీఆర్ కొంతమంది నాయకులకు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మరీ. ఆ టాపిక్ ఎత్తొద్దంటూ చెప్పారు. తన గురించి మీడియా ముందు మాట్లాడడం మానుకోవాలని సూచించడంతో కొంతమంది ఎమ్మెల్యేలు, లీడర్లు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
కొత్త చర్చ
అయితే ఇప్పటి వరకు కేటీఆర్ సీఎం కావాలని ఆకాంక్షించడంతో ఆయన నేడో రేపో సీఎం అవుతారన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా త్వరలోనే వారసున్ని ప్రకటించి బాధ్యతలకు దూరం అవుతారని కూడా అనుకుంటున్నారు. తాజాగా కేటీఆర్ కొంతమందికి ఫోన్ చేసి మరీ తన గురించి మాట్లాడవద్దని కోరడం సరికొత్థ చర్చకు దారి తీసింది. సడన్‌గా ఇలా ఫోన్లు రావడం ఏంటని పార్టీ వర్గాలు డిస్కషన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే కేటీఆర్ ఇలా దిశా నిర్దేశం చేయడం వెనక ఆంతర్యం ఏంటో అంతుచిక్కడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేటీఆర్ సీఎం అయ్యేందుకు పరిస్థితులు అన్ని అనుకూలంగా.మారాయని అనుకుంటున్న క్రమంలో. ఆయన ఫోన్ కాల్ కొత్త సంకేతాలను పంపినట్టయిందని అంటున్నవారూ లేకపోలేదు.