WHO కీలక ప్రకటన.. కరోనా ఆ ల్యాబ్ నుంచి లీక్ కాలేదు
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్.. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఇది జంతువు నుంచి మనుషులకు పాకిన వైరస్ మాత్రమేనని.. కానీ, అది ఏ జంతువున్న విషయాన్ని ఇంకా నిర్ధారించలేదని డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తం బృందం మంగళవారం ప్రకటించింది. 2019లో చైనాలోని వుహాన్ నగరంలో కరోనా కేసులు తొలిసారిగా నమోదయ్యాయి. ఇక్కడి వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పలు రకాల వైరస్ నమూనాలను […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్.. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఇది జంతువు నుంచి మనుషులకు పాకిన వైరస్ మాత్రమేనని.. కానీ, అది ఏ జంతువున్న విషయాన్ని ఇంకా నిర్ధారించలేదని డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తం బృందం మంగళవారం ప్రకటించింది.
2019లో చైనాలోని వుహాన్ నగరంలో కరోనా కేసులు తొలిసారిగా నమోదయ్యాయి. ఇక్కడి వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పలు రకాల వైరస్ నమూనాలను నిల్వ ఉంచారు. దీంతో అక్కడి నుంచే కరోనా లీకై సమీప ప్రాంతాల్లోకి వ్యాపించి ఉంటుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని చైనా ఖండించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పుట్టుకను కనిపెట్టేందుకు డబ్ల్యూహెచ్‌వోకు చెందిన శాస్త్రవేత్తల బృందం జనవరి 14న వుహాన్ చేరుకుంది. మొదట కరోనా కేసులు వెలుగు చూసిన హువానన్ సీఫుడ్ మార్కెట్ సహా అనేక ప్రాంతాలను సందర్శించింది.
డబ్ల్యూహెచ్‌వో నిపుణుల కమిటీ హెడ్ పీటర్ బెన్ ఎంబారెక్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీకై, మనుషులకు వ్యాపించి ఉండటానికి ఆస్కారం లేదన్నారు. గబ్బిలం నుంచి మరో జంతువులోకి ప్రవేశించి ఉంటుందని తెలిపారు. దాని నుంచి మనుషులకు వ్యాపించి ఉంటుందని ప్రాథమిక విశ్లేషణల్లో వెల్లడైందని స్పష్టం చేశారు. ఈ వైరస్ గబ్బిలాల నుంచి అలుగు లేదా బేంబూ ర్యాట్ అనే మరో జంతువు ద్వారా మానవుల్లోకి ప్రవేశించి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు.