డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన చేసింది. కొవిడ్ 19కు చికిత్స ఉండకపోవచ్చని తెలిపింది. ఇదేక్రమంలో కరోనా నివారణకు సులభమైన పరిష్కారం ఏదీ ఉండదని పేర్కొంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే ట్రేసింగ్, భౌతిక దూరం, మాస్క్ ధరించడం వంటి ప్రాథమిక అంశాలపైనే దృష్టి పెట్టాలని సూచించింది. ప్రతిరోజు జాగ్రత్తలు తీసుకోవాలని లేకుంటే ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా టీకా రూపకల్పనకు తీవ్ర ప్రయత్నాలు […]
దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన చేసింది. కొవిడ్ 19కు చికిత్స ఉండకపోవచ్చని తెలిపింది. ఇదేక్రమంలో కరోనా నివారణకు సులభమైన పరిష్కారం ఏదీ ఉండదని పేర్కొంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే ట్రేసింగ్, భౌతిక దూరం, మాస్క్ ధరించడం వంటి ప్రాథమిక అంశాలపైనే దృష్టి పెట్టాలని సూచించింది. ప్రతిరోజు జాగ్రత్తలు తీసుకోవాలని లేకుంటే ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా టీకా రూపకల్పనకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్యా సైతం ఆగస్టు 10వరకు టీకాను అందుబాటులోకి తెస్తామని ప్రకటన చేసింది.