డాడీబాయ్‌కు డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చిన ప్రముఖుడు ఎవరు..?

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. కొద్ది రోజులుగా స్తబ్ధుగా ఉన్న డ్రగ్స్ మాఫియా మళ్లీ జడలు విప్పుతోంది. ప్రముఖులనే టార్గెట్ చేసుకుని బ్లాక్ దందాను నడుపుతోంది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నడిపిన డాడీబాయ్ మళ్లీ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. గోవా కేంద్రంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేసేందుకు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నాడు. మార్చి 14న గోవా నుంచి హైదరాబాద్‌కు బస్సులో చేరిన డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం […]

Update: 2021-03-24 01:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. కొద్ది రోజులుగా స్తబ్ధుగా ఉన్న డ్రగ్స్ మాఫియా మళ్లీ జడలు విప్పుతోంది. ప్రముఖులనే టార్గెట్ చేసుకుని బ్లాక్ దందాను నడుపుతోంది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నడిపిన డాడీబాయ్ మళ్లీ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. గోవా కేంద్రంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేసేందుకు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నాడు.

మార్చి 14న గోవా నుంచి హైదరాబాద్‌కు బస్సులో చేరిన డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ డెలివరీని నైజీరియన్ జేమ్స్ చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో దాడి చేసి అతడిని అరెస్ట్ చేశారు. జేమ్స్‌ను విచారించిన పోలీసులకు సంచనల విషయాలు తెలిశాయి. ఇన్నేళ్లు సైలెంట్‌గా ఉన్న డాడీబాయ్ మళ్లీ హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్మకాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే 153 గ్రాముల కొకైన్ ను గోవా నుంచి తెచ్చినట్లు తెలిసింది.

అయితే ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఆర్డర్ ఇవ్వడంపై ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. ఈ స్థాయిలో ఆర్డర్ ఇచ్చిన ప్రముఖులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. డాడీబాయ్.. గోవా, బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా పోలీసులకు, సైబర్ క్రైం నిఘాకు చిక్కకుండా కోడ్ భాషను వినియోగిస్తున్నట్లు తెలిసింది. ‘గుడ్ స్టఫ్’ పేరిట ఈ డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఒకేసారి 153 గ్రాముల కొకైన్, 16 గ్రాముల ఎంవీఎంఏ దొరకడంతో ఎక్సైజ్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. హైదరాబాద్‌లో ఆర్డర్లు పెడుతున్నది ఎవరు? ఎవరెవరు డ్రగ్స్‌ను తీసుకుంటున్నారో కూపీ లాగే ప్రయత్నం ఎక్సైజ్ శాఖ చేస్తోంది.

Tags:    

Similar News