ఆ 52 మంది ఎక్కడ..?
దిశ, హైదరాబాద్ : నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కరోనా సోకడంతో.. ఇప్పుడు ఆ యువకుడు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగాడు అనే విషయాలను అధికారులు ఆరాదీస్తున్నారు. ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు వచ్చిన ఆ యువకుడు అంతకు ముందు కుటుంబ సభ్యులతో నాలుగు రోజులు ఇంట్లో గడిపినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే అనుమానంతో అపోలో ఆస్పత్రిలో చేరాడు. బెంగళూరు నుంచి నగరానికి వచ్చిన తర్వాత.. ఈ ఎనిమిది రోజుల పాటు బాధితుడు ఎవరితో సన్నిహితంగా ఉన్నాడనే విషయం […]
దిశ, హైదరాబాద్ : నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కరోనా సోకడంతో.. ఇప్పుడు ఆ యువకుడు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగాడు అనే విషయాలను అధికారులు ఆరాదీస్తున్నారు. ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు వచ్చిన ఆ యువకుడు అంతకు ముందు కుటుంబ సభ్యులతో నాలుగు రోజులు ఇంట్లో గడిపినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే అనుమానంతో అపోలో ఆస్పత్రిలో చేరాడు. బెంగళూరు నుంచి నగరానికి వచ్చిన తర్వాత.. ఈ ఎనిమిది రోజుల పాటు బాధితుడు ఎవరితో సన్నిహితంగా ఉన్నాడనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వారం రోజుల్లో మొత్తం 80 మందితో సన్నిహితంగా మెలిగినట్టు తెలుస్తుండగా.. బాధితుని కుటుంబ సభ్యులు, అతనికి చికిత్స చేసిన వైద్యులతో కలిపి మొత్తం 28మంది మాత్రమే గాంధీలో చేరారు. మిగతా 52 మంది ఎవరు? ఎక్కడున్నారు? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ తనతో సన్నిహితంగా మెలిగిన వారికి నిజంగా పాజిటివ్ ఉంటే.. వారు ఇప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరి ఆచూకి అధికారులకు అంతుబట్టడం లేదు. ఈ విషయం గ్రేటర్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.