స్టంట్ చేయబోయి గర్ల్‌ఫ్రెండ్ ముందు పరువు తీసుకున్న ప్రియుడు!
దిశ, వెబ్ డెస్క్: ఓ బైకిస్ట్ స్టంట్ చేయబోయి తన గర్ల్ ఫ్రెండ్ ముందు పరువుతీసుకున్నాడు. అంతేకాదు.. అతనికి, అతని గర్ల్ ఫ్రెండ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ బైకిస్ట్ రాత్రి సమయంలో బైక్ పై తన గర్ల్ ఫ్రెండ్ ను ఎక్కించుకుని రైడింగ్ చేస్తున్నాడు. రోడ్డుపై స్టంట్ చేయబోయాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కిందపడిపోయాడు. సుమారు అక్కడి నుంచి 20 మీటర్ల వరకు వారిని బైక్ […]
దిశ, వెబ్ డెస్క్: ఓ బైకిస్ట్ స్టంట్ చేయబోయి తన గర్ల్ ఫ్రెండ్ ముందు పరువుతీసుకున్నాడు. అంతేకాదు.. అతనికి, అతని గర్ల్ ఫ్రెండ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ బైకిస్ట్ రాత్రి సమయంలో బైక్ పై తన గర్ల్ ఫ్రెండ్ ను ఎక్కించుకుని రైడింగ్ చేస్తున్నాడు. రోడ్డుపై స్టంట్ చేయబోయాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కిందపడిపోయాడు. సుమారు అక్కడి నుంచి 20 మీటర్ల వరకు వారిని బైక్ లాక్కెళ్లింది. దీంతో అతనికి, అతని గర్ల్ ఫ్రెండ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన టీటీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు.