త్వరలో వాట్సాప్ మల్టీ డివైస్ సపోర్ట్?
దిశ, వెబ్‌డెస్క్: మొన్నటికి మొన్న వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్ పార్టిసిపెంట్లను పరిధిని పెంచిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో మరో కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టబోతోందని తెలుస్తుంది. ఇప్పటివరకు వాట్సాప్‌ను ఒక్క ఫోన్ నెంబరుతో ఒక్క ఫోన్ లేదా టాబ్లెట్‌లో మాత్రమే వాడుకునే అవకాశం ఉంది. మరీ అంతగా కావాలనిపిస్తే వాట్సాప్ వెబ్ ద్వారా కంప్యూటర్‌లో, ఫోన్లో ఒకేసారి వాడుకునే సదుపాయం ఉంది. కానీ ఒకే నెంబరుతో వేర్వేరు పరికరాల్లో వాడుకునే అనుమతి లేదు. అయతే […]
దిశ, వెబ్‌డెస్క్: మొన్నటికి మొన్న వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్ పార్టిసిపెంట్లను పరిధిని పెంచిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో మరో కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టబోతోందని తెలుస్తుంది. ఇప్పటివరకు వాట్సాప్‌ను ఒక్క ఫోన్ నెంబరుతో ఒక్క ఫోన్ లేదా టాబ్లెట్‌లో మాత్రమే వాడుకునే అవకాశం ఉంది. మరీ అంతగా కావాలనిపిస్తే వాట్సాప్ వెబ్ ద్వారా కంప్యూటర్‌లో, ఫోన్లో ఒకేసారి వాడుకునే సదుపాయం ఉంది. కానీ ఒకే నెంబరుతో వేర్వేరు పరికరాల్లో వాడుకునే అనుమతి లేదు. అయతే త్వరలోనే ఈ సదుపాయాన్ని వాట్సాప్ ప్రవేశ పెట్టబోతున్నట్లు సమాచారం.
వాబ్‌బీటాఇన్ఫో వారు తెలియజేసిన రిపోర్టుల ప్రకారం లేటెస్ట్ 2.20.143 బీటా అప్‌డేట్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కోడ్‌ని కూడా వాట్సాప్ డిప్లాయ్ చేసింది. ఈ ఫీచర్ వచ్చాక వాట్సాప్‌ని ఇతర పరికరాల్లో వాడుకునే అవకాశం కూడా కలగనుంది. అయితే ఇలా ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్లలో కలిసి ఒకేసారి వాడటానికి డేటా ఎక్కువ కావాల్సి వచ్చే అవకాశం కూడా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Tags – Whatsapp, Info, multi device, new features, roll out, beta version, codedeploy