విద్యార్థిని ఆదుకున్న వాట్సాప్ గ్రూప్..

దిశ, మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో కొత్త బస్‌స్టాండ్ వద్ద నివాసం ఉండే వయ్య ఏసు గత కొంతకాలంగా స్థానిక పాత ఇనుప సామాన్ దుకాణం‌లో దినసరి కూలీగా పనిచేసేవాడు. ఇటీవల ఆకస్మాత్తుగా గుండెపోటు‌ రావడంతో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయారు. ఏసు, భార్య వసంత, ఇద్దరు కుమార్తెలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. తన పెద్ద కూతురు ప్రవలిక‌ను ఉన్నత చదువులు చదివించాలని నల్గొండ‌లో ఓ నర్సింగ్ కళాశాలలో చేర్పించాడు. తండ్రి హఠాన్మరణం‌తో […]

Update: 2021-11-29 11:12 GMT

దిశ, మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో కొత్త బస్‌స్టాండ్ వద్ద నివాసం ఉండే వయ్య ఏసు గత కొంతకాలంగా స్థానిక పాత ఇనుప సామాన్ దుకాణం‌లో దినసరి కూలీగా పనిచేసేవాడు. ఇటీవల ఆకస్మాత్తుగా గుండెపోటు‌ రావడంతో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయారు. ఏసు, భార్య వసంత, ఇద్దరు కుమార్తెలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. తన పెద్ద కూతురు ప్రవలిక‌ను ఉన్నత చదువులు చదివించాలని నల్గొండ‌లో ఓ నర్సింగ్ కళాశాలలో చేర్పించాడు. తండ్రి హఠాన్మరణం‌తో తన కళాశాల ఫీజుల‌కు ఇబ్బందులు పడుతుండగా మన మోత్కూరు వాట్సాప్ గ్రూప్ దాతలు సహృదయంతో స్పందించి రూ.15,000 ఆ విద్యార్థినికి సహాయం చేశారు.

విశ్రాంత ఉపాధ్యాయులు, ఆర్యవైశ్య సంగం అధ్యక్షుడు మొగుళ్లపల్లి సోమయ్య చేతుల మీదుగా అందించారు. మున్ముందు ప్రవలికకు చదువులకు తమ వంతుగా సహకారం అందిస్తానని తెలిపారు. వాట్సాప్ గ్రూప్ సామాజిక సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాట్సాప్ గ్రూప్ ప్రతినిధులు ధబ్బేటి సోంబాబు, గంధం శ్రీనివాస్ రావ్, కారుపోతుల వెంకన్న, పోచం కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News