WhatsApp : వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చిన ‘పేమెంట్స్ బ్యాగ్రౌండ్’ ఫీచర్!

దిశ, ఫీచర్స్: పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్లకు ఎప్పటికప్పుడు నయా ఫీచర్లను అందిస్తుంది. అయితే స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బు పంపేటప్పుడు వినియోగదారులు ‘పేమెంట్స్ బ్యాగ్రౌండ్’ జోడించవచ్చని వాట్సాప్ తాజాగా ప్రకటించింది. అంతేకాదు ఐవోఎస్ యూజర్లు తమ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ ఫోన్‌కు బదిలీ చేసే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఇండియా యూజర్లకే పరిమితమైన ఈ న్యూ అప్డేట్స్ గురించి మరిన్ని విశేషాలు. పేమెంట్స్ బ్యాగ్రౌండ్స్ : మనీ పంపడంతో పాటు తమ అనుభూతిని […]

Update: 2021-08-17 03:19 GMT

దిశ, ఫీచర్స్: పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్లకు ఎప్పటికప్పుడు నయా ఫీచర్లను అందిస్తుంది. అయితే స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బు పంపేటప్పుడు వినియోగదారులు ‘పేమెంట్స్ బ్యాగ్రౌండ్’ జోడించవచ్చని వాట్సాప్ తాజాగా ప్రకటించింది. అంతేకాదు ఐవోఎస్ యూజర్లు తమ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ ఫోన్‌కు బదిలీ చేసే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఇండియా యూజర్లకే పరిమితమైన ఈ న్యూ అప్డేట్స్ గురించి మరిన్ని విశేషాలు.

పేమెంట్స్ బ్యాగ్రౌండ్స్ :

మనీ పంపడంతో పాటు తమ అనుభూతిని తెలియజేయడానికి ఇది ప్రజలకు సహాయపడుతుందని వాట్సాప్ ప్రకటించింది. ఉదాహరణకు మీ సోదరికి రక్షాబంధన్ రోజున పైసలు పంపేటప్పుడు మీరు రక్షాబంధన్ పేవ్‌మెంట్ బ్యాగ్రౌండ్ యాడ్ చేయొచ్చు. అదేవిధంగా పుట్టినరోజుల కోసం కేకులు, కొవ్వొత్తులతో బ్యాగ్రౌండ్ ఎంచుకోవచ్చు. ప్రతీ పేమెంట్ వెనకున్న కథను ప్రతిబింబిస్తూ.. చెల్లింపులను గుర్తుంచుకోవడంలో సహాయపడుతుందని వాట్సాప్ పేర్కొంది. ఇండియా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ గూగుల్ పే పేమెంట్స్ బ్యాగ్రౌండ్ ఫీచర్‌లా కనిపిస్తుంది. మెసేజింగ్ యాప్ వాట్సాప్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్యంతో భారతదేశంలో చెల్లింపుల ఫీచర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఎలా యాడ్ చేయవచ్చంటే:

– మీరు డబ్బు పంపాలనుకుంటున్న చాట్ మీద ట్యాప్ చేయండి.
– పంపించే మొత్తాన్ని నమోదు చేసి, బ్యాగ్రౌండ్ ఐకాన్‌పై నొక్కండి.
– అందుబాటులో ఉన్న ఎంపికల ద్వారా స్క్రోల్ చేసి, మీరు ఉపయోగించే నేపథ్యాన్ని క్లిక్ చేయండి.
– నేపథ్య ఎంపికలను తీసివేయడానికి X నొక్కితే చాలు.

చాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ :

వాట్సాప్ ఐవోఎస్ వినియోగదారుల కోసం చాట్ హిస్టరీ ఫీచర్‌ని కూడా విడుదల చేసింది. 2.21.160.16 iOS బీటా వెర్షన్ వాడుతున్నవారికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందని WaBetaInfo నివేదించింది. మీరు దీన్ని సెట్టింగ్స్ సెక్షన్> చాట్స్‌లో కనుగొంటారు. ఇందులో ‘మూవ్ చాట్స్ టు ఆండ్రాయిడ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేస్తే చాలు చాట్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అయితే చాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని వాట్సాప్ తెలిపింది. ప్రస్తుతం, Samsung Galaxy Z Fold 3 లేదా Galaxy Z Flip 3 ఉపయోగిస్తున్న వారు మాత్రమే ఈ ఫీచర్‌ని ఉపయోగించగలుగుతున్నారు.

Tags:    

Similar News