జనాభాలెక్కలకు అడిగే ప్రశ్నలివే..

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి పదేళ్లకు జనాభా లెక్కల సేకరణలో భాగంగా ఏప్రిల్ 1, 2020 నుంచి సెప్టెంబర్ 30, 2020 వరకు 2021 జనాభా లెక్కల సేకరణ జరగబోతోంది. ఈ సేకరణలో భాగంగా ఏమేం ప్రశ్నలు అడగాలనే జాబితాను అధికారులు తయారుచేశారు. మారుతున్న కాలంతో పాటు కొత్త ప్రశ్నలను చేర్చారు. ఉన్న ప్రశ్నలను అప్‌డేట్ చేసి మొత్తం 31 ప్రశ్నల జాబితాను సిద్ధం చేశారు. ఇంటి నెంబర్, సెన్సస్ హౌస్ నెంబర్, ఇంటి పైకప్పు రకం, ఇంటి […]

Update: 2020-03-05 02:33 GMT

దిశ, వెబ్‌డెస్క్:
ప్రతి పదేళ్లకు జనాభా లెక్కల సేకరణలో భాగంగా ఏప్రిల్ 1, 2020 నుంచి సెప్టెంబర్ 30, 2020 వరకు 2021 జనాభా లెక్కల సేకరణ జరగబోతోంది. ఈ సేకరణలో భాగంగా ఏమేం ప్రశ్నలు అడగాలనే జాబితాను అధికారులు తయారుచేశారు. మారుతున్న కాలంతో పాటు కొత్త ప్రశ్నలను చేర్చారు. ఉన్న ప్రశ్నలను అప్‌డేట్ చేసి మొత్తం 31 ప్రశ్నల జాబితాను సిద్ధం చేశారు.

ఇంటి నెంబర్, సెన్సస్ హౌస్ నెంబర్, ఇంటి పైకప్పు రకం, ఇంటి వాడకం, ఇంటి స్థితి, ఇంట్లో సభ్యుల సంఖ్య, కుటుంబం సంఖ్య, ఇంటి యజమాని పేరు, ఇంటి యజమాని జెండర్, షెడ్యూల్డ్ తెగ లేదా కులానికి చెందిన వారా?, ఇంటి యజమాన్య రకం, ఇంట్లో ఉన్న గదుల సంఖ్య, తాగునీటి ప్రధాన వనరు, తాగునీటి సౌకర్యం, లైటింగ్ వనరు, టాయ్‌లెట్ సౌకర్యం, టాయ్‌లెట్ రకం, ఇంకుడు గుంత, స్నానాల గది, గ్యాస్ కనెక్షన్, వంటకు ఇంధన రకం, రేడియో లేదా ట్రాన్సిస్టర్, టీవీ, ఇంటర్నెట్ సౌకర్యం, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్, మొబైల్ ఫోన్, టూ వీలర్, ఫోర్ వీలర్, ప్రధానంగా తినే ఆహారం, మొబైల్ నెంబర్… ఇలా 31 రకాల ప్రశ్నలను జనాభా లెక్కల అధికారి అడగనున్నారు.

అయితే ఈ ప్రశ్నల్లో మీ మొబైల్ నెంబర్ ఏంటి? అనే ప్రశ్న గురించి అందరూ చెవులు రెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ వ్యక్తిగత స్వేచ్ఛ గురించి భయాందోళనలు చెందుతున్న ప్రజలు, మొబైల్ నెంబర్ ఎందుకు చెప్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం జనాభా లెక్కలకు సంబంధించిన కమ్యూనికేషన్ కోసమే తప్ప వేరే అవసరాల కోసం కాదని అధికారులు స్పష్టం చేశారు.

Tags: Census 2021, India, Mobile Number, Quessionarie, Enquiry

Tags:    

Similar News