'తౌక్తే' అంటే ఏమిటో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: అరేబియా సముద్రంలో తౌక్తే తుఫాన్ ఏర్పడగా.. ప్రస్తుతం కేరళ తీరానికి సమీపంలో ఇది ఉంది. ఈ నెల 18న గుజరాత్ తీరాన్ని తాకనుండగా.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. అయితే ఈ తుఫాన్‌కు పేరు పెట్టే అవకాశం ఈసారి మయన్మార్‌కు దక్కింది. మయన్మార్ వాతావరణ విభాగం బల్లి పేరును ఈ తుఫాన్‌కి పెట్టింది. బర్మా భాషలో తౌక్తే అంటే అధికంగా ధ్వనులు చేసే బల్లి […]

Update: 2021-05-15 07:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: అరేబియా సముద్రంలో తౌక్తే తుఫాన్ ఏర్పడగా.. ప్రస్తుతం కేరళ తీరానికి సమీపంలో ఇది ఉంది. ఈ నెల 18న గుజరాత్ తీరాన్ని తాకనుండగా.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. అయితే ఈ తుఫాన్‌కు పేరు పెట్టే అవకాశం ఈసారి మయన్మార్‌కు దక్కింది. మయన్మార్ వాతావరణ విభాగం బల్లి పేరును ఈ తుఫాన్‌కి పెట్టింది.

బర్మా భాషలో తౌక్తే అంటే అధికంగా ధ్వనులు చేసే బల్లి అని అర్థం. కాగా ఆసియా ప్రాంతంలో ఏర్పడే తుఫాన్‌లకు పేర్లు పెట్టే అవకాశం వంతుల వారీగా దేశాలకు దక్కుతాయనే విషయం తెలిసిందే.

Tags:    

Similar News