లంగ్ క్యాన్సర్.. చెడు అలవాట్లు లేకున్నా వస్తుందా?
దిశ, వెబ్‌డెస్క్ : లంగ్ క్యాన్సర్ వల్ల ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఎక్కువ మంది ఈ జబ్బు బారినేపడుతున్నారు. అయితే లంగ్ క్యాన్సర్ వచ్చినట్లు మొదట్లోనే గుర్తించడం కొంచెం కష్టమైన పనే. ఈ జబ్బు చాలా సైలెంట్‌గా శరీరాన్ని నష్టపరుస్తుంది. లక్షణాలు బాగా ముదిరితేనే తప్ప గుర్తించలేం. అలాగని చెడు అలవాట్ల వలనే లంగ్ క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అనేక అంశాలు దోహదపడతాయి. ఏ రకమైన […]
దిశ, వెబ్‌డెస్క్ :
లంగ్ క్యాన్సర్ వల్ల ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఎక్కువ మంది ఈ జబ్బు బారినేపడుతున్నారు. అయితే లంగ్ క్యాన్సర్ వచ్చినట్లు మొదట్లోనే గుర్తించడం కొంచెం కష్టమైన పనే. ఈ జబ్బు చాలా సైలెంట్‌గా శరీరాన్ని నష్టపరుస్తుంది. లక్షణాలు బాగా ముదిరితేనే తప్ప గుర్తించలేం. అలాగని చెడు అలవాట్ల వలనే లంగ్ క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అనేక అంశాలు దోహదపడతాయి. ఏ రకమైన చెడు అలవాట్లు లేకపోయినా వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో 90 శాతం కేసుల్లో క్యాన్సర్ వ్యాప్తికి పొగాకు వాడకమే ప్రధాన కారణం. సాధారణ వ్యక్తితో పోలిస్తే పొగతాగేవారిలో ఈ వ్యాధి రావడానికి అవకాశాలు 2.5 రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్న వివరాల మేరకు వాతావరణ కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ప్రస్తుతం బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సర్ వచ్చిందని తెలిసిన విషయమే. అతనికి స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో లంగ్ క్యాన్సర్ అసలు ఎలా వస్తుంది? దానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
లంగ్ క్యాన్సర్ రావటానికి మూడు కారణాలున్నాయి. అందులో మొదటిది స్మోకింగ్ అలవాటు. మనదేశంలో ఎక్కువ శాతం ఈ అలవాటున్నవారే లంగ్ క్యాన్సర్ ముప్పును ఎదుర్కొంటున్నారు. పొగతాగే అలవాటున్నవారు మానేయడం వల్ల.. కొంతవరకు ఈ ముప్పును తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. సిగరెట్ స్మోకింగ్ అనే అలవాటు.. ఈ ఒక్క వ్యాధికే పరిమితం కాలేదు. చాలా వ్యాధులకు కారణభూతంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌తోనూ స్మోకర్స్‌కు ప్రమాదం పొంచి ఉంది. రెండో కారణంగా వాయు కాలుష్యాన్ని చెప్పుకోవచ్చు. ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ, హానికారక రసాయనాలు, వెహికల్స్ నుంచి వెలువడే పొగ ఇవన్నీ కూడా గాలిని కలుషితం చేస్తాయి. ఆ గాలిని పీల్చటం వల్ల లంగ్ క్యాన్సర్ ముప్పు ఉంటుంది. ఇక మూడో కారణమేంటంటే.. ఇది జన్యుసంబంధమైంది. శరీరంలో ఉన్న జన్యువుల్లో మార్పు వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
స్టేజ్ ఆఫ్ క్యాన్సర్..
క్యాన్సర్ అనగానే.. ముందుగా చెప్పుకోవాల్సింది క్యాన్సర్ ముదిరే దశల గురించే. ప్రధానంగా మూడు దశల్లో క్యాన్సర్ ముదురుతుందని వైద్యులు చెబుతుంటారు. మొదటి దశలో శరీరంలోని ఒక భాగాన్ని కేంద్రంగా చేసుకుని అక్కడే క్యాన్సర్ కణాలు తీవ్ర సంఖ్యలో పెరుగుతుంటాయి. ఇలా ఆరంభ దశలో క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తే.. క్యాన్సర్ సోకిన శరీర భాగాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు. రెండో దశలో క్యాన్సర్ కణాలు శరీరంలో ఒక అవయవం నుంచి మరొక అవయవానికి వ్యాపిస్తాయి. ఈ దశలో కీమోథెరపీ, రేడియోథెరపీతో పాటు సర్జరీ చేయడం ద్వారా ఆ కణాలను తొలగిస్తారు. ఇక మూడో దశలో.. క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు పూర్తిస్థాయిలో విస్తరిస్తాయి. అంటే జబ్బు బాగా ముదిరిందని అర్థం. దాదాపు ఆ దశలో ఆశలు వదులుకోవాల్సిందేనని వైద్యులు చెబుతారు. కానీ కీమోథెరపీ ద్వారా సాధ్యమైనంత మేర చికిత్స అందిస్తారు.
స్టేజ్ లంగ్ క్యాన్సర్ :
దీన్ని 3ఎ, 3బీ, 3సీ అనే మూడు రకాలుగా వైద్యులు విభజించారు.
3ఎ : లంగ్ క్యాన్సర్‌లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ట్యూమర్లు ఊపిరితిత్తుల్లో ఉంటాయి. కానీ క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించదు.
3బీ : లంగ్ క్యాన్సర్‌లో ఒకే ఊపిరితిత్తిలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ట్యూమర్లు ఉంటాయి. అవి అడ్వాన్స్ స్టేజిలో ఉంటాయి. క్యాన్సర్ లింఫ్ నోడ్స్‌కు వ్యాపించే అవకాశం ఉంటుంది.
3సీ : లంగ్ క్యాన్సర్‌లో ఊపిరితిత్తిలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ట్యూమర్లు ఉంటాయి. లింఫ్ నోడ్స్‌కు కూడా క్యాన్సర్ వ్యాపిస్తుంది. అలాగే ఛాతిలో ఇతర భాగాలకు క్యాన్సర్ విస్తరిస్తుంది. హార్ట్, బ్రెస్ట్ బోన్స్‌తో పాటు దగ్గర్లోని టిష్యూస్‌కు కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్‌లో ఇది అడ్వాన్స్‌డ్ స్టేజ్.
స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ లక్షణాలు :
– చాతిలో ఎప్పుడూ నొప్పిగా ఉంటుంది.
– విపరీతమైన దగ్గు ఉంటుంది
– దగ్గుతున్నప్పుడు నోట్లో నుంచి రక్తం కూడా పడుతుంది.
– శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది, బరువు తగ్గుతారు.
– ఆకలి నశిస్తుంది.
– తీవ్రమైన అలసట
– ముఖమంతా ఉబ్బిపోయి కనిపిస్తుంది.
చికిత్స :
– సర్జరీ
– కీమోథెరపీ
– రేడియేషన్ థెరపీ
– టార్గెటెడ్ థెరపీ
– ఇమ్యునోథెరపీ
– లేజర్ థెరపీ
– ఎండోస్కోపిక్ స్టెంట్