పన్నులు పెరిగినా తగ్గని బంగారం దిగుమతి!
దిశ, వెబ్‌డెస్క్: భారత్ 2016-2020 మధ్య కాలంలో మొత్తం 86 శాతం బంగారాన్ని దిగుమతి చేసుకుందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) నివేదిక వెల్లడించింది. దిగుమతి సుంకాలు అధికంగా ఉన్నప్పటికీ గిరాకీ మెరుగ్గా ఉందని నివేదిక అభిప్రాయపడింది. ‘బులియన్ ట్రేడ్ ఇన్ ఇండియా’ పేరుతో డబ్ల్యూజీసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశీయంగా పాత బంగారం, ఆభరణాలు, జువెలరీలు 13 శాతం రీసైక్లింగ్ చేయబడ్డాయని, స్థానికంగా వెలికితీసిన బంగారం 1 శాతమే అని పేర్కొంది. 2012లో మొదటిసారిగా దిగుమతులపై […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్ 2016-2020 మధ్య కాలంలో మొత్తం 86 శాతం బంగారాన్ని దిగుమతి చేసుకుందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) నివేదిక వెల్లడించింది. దిగుమతి సుంకాలు అధికంగా ఉన్నప్పటికీ గిరాకీ మెరుగ్గా ఉందని నివేదిక అభిప్రాయపడింది. ‘బులియన్ ట్రేడ్ ఇన్ ఇండియా’ పేరుతో డబ్ల్యూజీసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశీయంగా పాత బంగారం, ఆభరణాలు, జువెలరీలు 13 శాతం రీసైక్లింగ్ చేయబడ్డాయని, స్థానికంగా వెలికితీసిన బంగారం 1 శాతమే అని పేర్కొంది. 2012లో మొదటిసారిగా దిగుమతులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 6,581 టన్నుల బంగారం దిగుమతి జరిగింది.
ప్రతి ఏటా సగటున 730 టన్నుల బంగారం దిగుమతులు నమోదయ్యాయి. 2020లో భారత్ 30కి పైగా దేశాల నుంచి 377 టన్నుల బంగారు లోహాలను దిగుమతి చేసుకుంది. ఇందులో 55 శాతం కేవలమ స్విట్జర్లాండ్, యూఏఈ నుంచి దిగుమతి అయిందని నివేదిక తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా 100 గ్రాముల బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న డీలర్లు, తయారీదారుల నుంచి 100 గ్రాముల బంగారం కడ్డీలకు డిమాండ్ అధికంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఈ ఏడాది కంటే 2022లో బంగారం దిగుమతులు మరింత బలంగా ఉండనున్నట్టు నివేదిక అంచనా వేసింది.