పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు మిత్రా కన్నుమూత

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమెన్ మిత్రా హఠాత్తుగా మరణించాడు. ఆయనకు గురువారం తెల్లవారుజామూన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా సోమెన్ కిడ్నీ, గుండె సంబంధ రోగాలతో బాధపడుతున్నాడు. దీంతో జూలై మొదట్లో కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్యం విషమించడంతో గురువారం ఒంటి గంట సమయంలో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మిత్రాకు భార్య, కుమారుడున్నారు. చౌరంగీ జిల్లా […]

Update: 2020-07-29 20:18 GMT

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమెన్ మిత్రా హఠాత్తుగా మరణించాడు. ఆయనకు గురువారం తెల్లవారుజామూన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా సోమెన్ కిడ్నీ, గుండె సంబంధ రోగాలతో బాధపడుతున్నాడు. దీంతో జూలై మొదట్లో కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేరాడు.

ఆరోగ్యం విషమించడంతో గురువారం ఒంటి గంట సమయంలో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మిత్రాకు భార్య, కుమారుడున్నారు. చౌరంగీ జిల్లా సీల్దాహ్ నియోజకవర్గం నుంచి 1972-2006ల మధ్య ఎమ్మెల్యేగా సేవలందించారు. మిత్రా మృతి పట్ల పశ్చిమబెంగాల్ యువజన కాంగ్రెస్ విభాగం సంతాపం తెలిపింది.

Tags:    

Similar News