బెంగాల్‌లో అధికార భాషగా తెలుగు

దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌ తెలుగు ప్రజల చిరకాల వాంచ నెరవేరింది. తెలుగును అధికార భాషగా గుర్తించాలని అక్కడి తెలుగు ప్రజలు ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కాగా తెలుగును అధికార భాషగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళ వారం ఆమోదించింది. ఈ మేరకు అధికార భాషగా తెలుగును గుర్తిస్తూ క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో బెంగాల్‌లోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఖరగ్ పూర్ ప్రాంతలో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా ఇప్పటికే బెంగాల్‌లో పదికి […]

Update: 2020-12-22 11:50 GMT

దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌ తెలుగు ప్రజల చిరకాల వాంచ నెరవేరింది. తెలుగును అధికార భాషగా గుర్తించాలని అక్కడి తెలుగు ప్రజలు ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కాగా తెలుగును అధికార భాషగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళ వారం ఆమోదించింది. ఈ మేరకు అధికార భాషగా తెలుగును గుర్తిస్తూ క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో బెంగాల్‌లోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఖరగ్ పూర్ ప్రాంతలో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా ఇప్పటికే బెంగాల్‌లో పదికి పైగా అధికార భాషలు ఉన్నాయి.

Tags:    

Similar News