వచ్చే జూన్ వరకూ..పేదలకు ఫ్రీ రేషన్ : మమతా బెనర్జీ

కోల్‌కతా: కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జూన్ వరకు పేదలకు ఉచితంగా రేషన్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఓ ప్రకటన చేశారు. లాక్‌డౌన్ సమయంలో ప్రకటించిన ఉచిత రేషన్ పథకాన్ని 2021 జూన్ వరకూ పొడిగిస్తున్నట్లు ఆమె తెలిపారు. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించిన కాసేపటికే మమత ఈ ప్రకటన […]

Update: 2020-06-30 10:39 GMT

కోల్‌కతా: కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జూన్ వరకు పేదలకు ఉచితంగా రేషన్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఓ ప్రకటన చేశారు. లాక్‌డౌన్ సమయంలో ప్రకటించిన ఉచిత రేషన్ పథకాన్ని 2021 జూన్ వరకూ పొడిగిస్తున్నట్లు ఆమె తెలిపారు. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించిన కాసేపటికే మమత ఈ ప్రకటన చేశారు. మోదీ కూడా తన ప్రసంగంలో పేదలకు ఉచితంగా ఆహార పదార్థాలను అందించే పథకాన్ని నవంబరు వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News