‘డబుల్ బెడ్రూం’ నిర్మాణ పనుల్లో అపశృతి.. కుప్పకూలిన బెంగాల్ వాసి

దిశ, పరిగి : డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల కోసం వచ్చిన ఓ దినసరి కూలీ గుండె పోటుతో ఆదివారం మృతి చెందాడు. దోమ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం..పశ్చిమ బెంగాల్ రాష్ర్టం పరగనాస్ జిల్లాకు చెందిన ముష్యంపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గోష్ (44 ) బతుకు దెరువు కోసం వికారాబాద్ జిల్లా దోమ మండలానికి వలస వచ్చాడు. మండలంలో నిర్మితమవుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో పనిలో చేరాడు. ఈ […]

Update: 2021-08-22 12:02 GMT

దిశ, పరిగి : డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల కోసం వచ్చిన ఓ దినసరి కూలీ గుండె పోటుతో ఆదివారం మృతి చెందాడు. దోమ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం..పశ్చిమ బెంగాల్ రాష్ర్టం పరగనాస్ జిల్లాకు చెందిన ముష్యంపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గోష్ (44 ) బతుకు దెరువు కోసం వికారాబాద్ జిల్లా దోమ మండలానికి వలస వచ్చాడు. మండలంలో నిర్మితమవుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో పనిలో చేరాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో కిందపడిపోయాడు. వెంటనే పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి లక్ష్మణ్ గోష్ మృతి చెందినట్లు తెలిపారు. మురారీ గోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.

Tags:    

Similar News