బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీ అవినీతిపరులైన కొంత మంది నాయకులను కొనగలదు కానీ, నిజమైన పార్టీ కార్యకర్తలను కాదన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అవినీతిపరులకు చోటులేదని, ఎవరైనా సరే పార్టీని వీడాలనుకుంటే వెంటనే ఆ పని చేయాలని సూచించారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దీపక్ హల్దార్ టీఎంసీకి రాజీనామా చేసి సోమవారం బీజేపీలో […]
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీ అవినీతిపరులైన కొంత మంది నాయకులను కొనగలదు కానీ, నిజమైన పార్టీ కార్యకర్తలను కాదన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అవినీతిపరులకు చోటులేదని, ఎవరైనా సరే పార్టీని వీడాలనుకుంటే వెంటనే ఆ పని చేయాలని సూచించారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దీపక్ హల్దార్ టీఎంసీకి రాజీనామా చేసి సోమవారం బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మమతా బెనర్జీ పై వ్యాఖ్యలు చేశారు. ‘ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. రాష్ట్రంలో మా-మాతి-మనుషు(టీఎంసీ నినాదం) ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ ఓ గ్యాస్ బెలూన్. మీడియాలో మాత్రమే సజీవంగా ఉంది. ప్రజల గుండెల్లో టీఎంసీ ఉంది. అలాగే నాపై నమ్మకం ఉంచండి. నేను మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తాను’ అని మమత అన్నారు.