కన్యరాశి వారు భర్తలతో వాదనకు దిగితే ఏమవుతుందో తెలుసా..!

తేది : 23, జూన్ 2021 ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : బుధవారం పక్షం : శుక్లపక్షం తిథి : త్రయోదశి (నిన్న ఉదయం 10 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 59 ని॥ వరకు) నక్షత్రం : అనూరాధ (నిన్న మద్యాహ్నం 2 […]

Update: 2021-06-22 11:49 GMT

తేది : 23, జూన్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : త్రయోదశి
(నిన్న ఉదయం 10 గం॥ 22 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 6 గం॥ 59 ని॥ వరకు)
నక్షత్రం : అనూరాధ
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 22 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 48 ని॥ వరకు)
యోగము : సాధ్యము
కరణం : తైతిల
వర్జ్యం : (సాయంత్రం 4 గం॥ 48 ని॥ నుంచి రాత్రి 6 గం॥ 13 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (తెల్లవారు జాము 2 గం॥ 30 ని॥ నుంచి 3 గం॥ 55 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 11 గం॥ 51 ని॥ నుంచి 12 గం॥ 43 ని॥ వరకు)
రాహుకాలం : (ఉదయం 12 గం॥ 17 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
గుళికకాలం : (ఉదయం 10 గం॥ 39 ని॥ నుంచి 12 గం॥ 17 ని॥ వరకు)
యమగండం : (ఉదయం 7 గం॥ 21 ని॥ నుంచి 8 గం॥ 59 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 43 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 53 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : వృచ్చికము

మేష రాశి : ఆశావాహ దృక్పథం పట్టుదలతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. కొంతమందికి ఉద్యోగ రీత్యా టూర్స్. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు పొందుతారు డబ్బుని పెట్టుబడులు పెట్టే ముందర అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. సహనంతో వ్యవహరించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుంటారు.

వృషభ రాశి : స్థిరాస్తి కొనుగోలులో ధర మీకు అందుబాటులో ఉంటుంది. ఫిట్‌నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. బంగారు నగల వ్యాపారం చేసే వారికి అధిక లాభాలు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం కుదిరే అవకాశం. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆదాయం పర్వాలేదు అనవసరపు ఖర్చులను నివారించండి ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మిధున రాశి : స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అనవసరపు దుబారా ఖర్చులను నివారించండి. వ్యాపారస్తులు తమ ఎకౌంట్స్ ను పరిశీలించుకోండి. అనుకున్న కార్యాలను సాధించటానికి అధిక శ్రమ. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆదాయం పరవాలేదు కొంతమంది ఇంటి మరమ్మతులపై ఖర్చు పెడతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

కర్కాటక రాశి : ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆదాయం పర్వాలేదు. దుబారా ఖర్చులను నివారించండి. మరి ఇంత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు కొంతమందికి ఉద్యోగ రీత్యా టూర్స్. నూతన బాధ్యతల వలన ఆఫీసులో పనులను అధిక శ్రమతో పూర్తిచేస్తారు. ఫిట్ నెస్ మీద శ్రద్ధ పెడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు కుటుంబ ఖర్చులు అధికంగా ఉండటం మీద గొడవ పడతారు.

సింహరాశి : ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ఉద్రేకపూరితమైన ఆలోచనలను వదిలివేయండి పై చదువుల కొరకు ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం. కొంతమందికి ఉద్యోగంలో ఇంక్రిమెంట్. కావలసినంత ధనం చేతికందుతుంది. దానధర్మాల వలన దైవ బలం నూతన బాధ్యతల వల్ల ఆఫీసులో పనులను అధిక శ్రమతో పూర్తి చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కన్యారాశి : ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తులపై పెట్టుబడులు లాభాలు అందుతాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టండి. టీవీ మొబైల్ వాడకం వలన సమయం వృధా. ఖర్చుల విషయమై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వారు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. ఆఫీసులో మీ పిడి వాదం వలన పనులు పూర్తి కావు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు మొండి వాదనలకు దిగకండి ఒకరినొకరు అభిప్రాయాలను గౌరవించుకోండి.

తులారాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి వారితో ఆనందంగా గడుపుతారు. ఫిట్నెస్ పై శ్రద్ధ పెడతారు. కుటుంబ ఖర్చుల గురించి అదేపనిగా ఆలోచించడం వలన మానసిక అశాంతి. ఆఫీసులో పనులను అధిక శ్రమతో పూర్తి చేస్తారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగ పరచుకోండి. వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. ఆదాయం పరవాలేదు. అధిక శ్రమ వలన కాళ్ల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

వృశ్చిక రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. కుటుంబంలో పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒత్తిడి వలన ఆరోగ్య సమస్యలు రావచ్చు. విశ్రాంతి ఒక మంచి ఉపాయం. మెడిటేషన్ కూడా ఒక మంచి ఉపాయం. దేవాలయాల సందర్శన వలన మానసిక బలం. మీ పిల్లల ప్రగతి మీకు గర్వకారణం. కొంతమందికి వారినుంచి ధనం అందుతుంది. నూతన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఆఫీసు పనులలో మీ సలహాలు అందరినీ మెప్పిస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలు మరిచిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

ధనస్సు రాశి : ఆశావహ దృక్పథంతో ఆలోచించండి వ్యాపారస్తులకు వారు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న అవకాశం లభిస్తుంది. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు వారి నుంచి సరైన సలహాలు తీసుకోండి. అప్పులు ఇస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అది మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

మకర రాశి : దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు కేసు మీకు అనుకూలం. ఫిట్ నెస్ కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం. బంధువులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీరు కోటీశ్వరులు కావాలంటే సరైన ప్రణాళిక లో పెట్టుబడులు పెట్టండి మరింత పొదుపు చేయండి. అనుకున్న కార్యాలను సాధించాలంటే పట్టుదల అవసరం. కోపతాపాలను అదుపులో పెట్టుకోండి. కొంతమందికి ఉద్యోగ పరంగా టూర్స్. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

కుంభ రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఇతరుల నుంచి బహుమానాలు అందుకుంటారు. మరి ఇంత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆఫీసులో ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి. ఆఫీసులో నూతన బాధ్యతలు వలన అధిక శ్రమ ఉంటుంది సహనంతో వ్యవహరించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలు marachipondi మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి : సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. స్టాక్ మార్కెట్ ల ద్వారా లాభం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపటం మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

Tags:    

Similar News