Today weather Update: నేటి వాతావరణం అప్డేట్ ఇదే

ఏపీలో రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది

Update: 2024-11-09 03:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వాతావరణం రోజు రోజుకు మారిపోతుంది. తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరుగుతుంది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ (Hyderabad) లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 33 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 26 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

వరంగల్ లో (Warangal) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 26 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 1 తర్వాత వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.

విజయవాడలో (Vijayawada) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 33 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 29 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 1 తర్వాత అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.

విశాఖపట్నంలో (Visakhapatnam) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 28 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది. 

Tags:    

Similar News