రాష్ట్ర ప్రజలకు Rain alert: తుఫాను కారణంగా మూడు రోజుల పాటు వర్షాలు

నాలుగు రోజుల క్రితం అరేబియా సముద్రంలో మూడు తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన విషయం తెలిసిందే.

Update: 2024-10-11 02:43 GMT

దిశ, వెబ్ డెస్క్: నాలుగు రోజుల క్రితం అరేబియా సముద్రంలో మూడు తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఒక తుఫాను కారణంగా మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు పైన తెలిపిన జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇదిలా ఉంటే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో రెండు మూడు రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా జూన్ చివరి వారంలో కూడా ఇలానే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లడంతో పలు జిల్లాల్లో భారీ వరదలు సంభవించాయి. నాటి వరదల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో మరోసారి తుఫాను హెచ్చరికలు జారీ కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో జీవనం కొనసాగించాల్సి వస్తుంది.


Similar News