ఇంట్లో కూడా మాస్క్ తప్పనిసరా?
దిశ, వెబ్ డెస్క్: లాక్డౌన్ 4.0 లో ఆంక్షలు ఉన్నప్పటికీ.. సడలింపుల కారణంతో.. కరోనా వైరస్ రోజురోజుకూ మరింత విస్తరిస్తూ పోతోంది. ఏదీ ఏమైనా.. కరోనాతో కలిసి బతకాల్సిందేనని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటకు వెళ్లకపోవడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడటం.. ఇలాంటి మనం పాటిస్తున్న చిన్న చిన్న జాగ్రత్తా చర్యలే మనకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ […]
దిశ, వెబ్ డెస్క్: లాక్డౌన్ 4.0 లో ఆంక్షలు ఉన్నప్పటికీ.. సడలింపుల కారణంతో.. కరోనా వైరస్ రోజురోజుకూ మరింత విస్తరిస్తూ పోతోంది. ఏదీ ఏమైనా.. కరోనాతో కలిసి బతకాల్సిందేనని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటకు వెళ్లకపోవడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడటం.. ఇలాంటి మనం పాటిస్తున్న చిన్న చిన్న జాగ్రత్తా చర్యలే మనకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం కామన్ అయిపోయింది. ఐతే బీఎమ్‌జే గ్లోబల్ హెల్త్‌లో ప్రచురితమైన ఓ నివేదిక మాత్రం ఇక మీదట ఇంట్లో కూడా మాస్క్ ధరించాలని చెబుతుంది.
బీఎమ్‌జే గ్లోబల్ హెల్త్ ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఇంట్లో ఎవరికీ కూడా కరోనా పాజిటివ్ రాక ముందు నుంచే మాస్క్ ధరిస్తే.. వైరస్ వ్యాప్తిని 79 శాతం వరకు తగ్గించొచ్చని తేల్చి చెప్పింది. ఇందుకోసం దాదాపు 124 కుటుంబాలపై సర్వే చేసింది. కిటికీలు తెరిచి ఉంచడం, కుటుంబ సభ్యుల మధ్య కనీసం ఒక మీటరు సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయడం, ప్రతిరోజు బ్లీచ్ తో ఇంటిని శుభ్రపరచడం వంటివి చేయడం వల్ల.. కరోనా వైరస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. కుటుంబాల్లోనో వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని, ఒక గంటలోనే ఇంట్లో ఉన్న అందరికీ కరోనా స్ప్రెడ్ అవుతోందని తెలిపారు. అంతేకాదు.. ఫిబ్రవరి, మార్చిలో నమోదైన కేసుల్లో నాలుగింట్లో ఒకరు ఇంటి సభ్యులతోనే ఇన్ ఫెక్ట్ అయినట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ 124 కుంటుంబాలలో.. 41 ఇళ్లలో మొదట వైరస్ సోకిన వారి నుంచి దాదాపు 77 మందికి వ్యాధి సోకినట్లు పరిశోధకులు గుర్తించారు. వీరిలో చిన్నపిల్లలకు టిపికల్లీ మైల్డ్ సింప్టమ్స్ కనిపించగా, యువకుల్లో 83శాతం మందికి మైల్డ్ సింప్టమ్స్ కనిపించాయి. పది మందిలో ఒకరికి మాత్రం సీవియర్ సింప్టమ్స్ కనిపించాయి. ఇంట్లో కుటుంబ సభ్యులందరు ఒక్కచోట చేరి భోజనం చేయడం, టీవీ చూడటం వల్ల వైరస్ సోకే ప్రమాదం 18 శాతం ఎక్కువ ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడం.. మాస్క్ ధరించం వల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించగలమని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైరస్ నిపుణుడు వు జున్యూ అన్నారు. బయటకు వెళ్లినప్పుడే కాదు.. ఇంట్లో కూడా మాస్క్ వాడితే.. కరోనాను కట్టడి చేయడానికి బాగుంటుందని, కుటుంబాల్లో త్వరగా వ్యాప్తి చెందడాన్ని ఆపొచ్చని వు జున్యూ అంటున్నారు. ఎమోరీ యూనివర్సిటీ కి చెందిన అసోసియేట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కొలీన్ క్రాఫ్ట్ మాస్క్ తప్పక ధరించాలని, దాని వల్లే చాలా వరకు వైరస్ వ్యాప్తి జరగలేదని ఆయన అంటున్నారు.