మేము గెలిస్తే సీఏఏ రద్దు చేస్తాం..
దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి పోటీ పడుతున్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేస్తామని అన్నారు. అసోంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని అమలు కానీయబోమని చెప్పారు. పౌరసత్వ చట్టాన్ని.. అధికార బీజేపీ ఒక రాజకీయా […]
దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి పోటీ పడుతున్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేస్తామని అన్నారు. అసోంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని అమలు కానీయబోమని చెప్పారు. పౌరసత్వ చట్టాన్ని.. అధికార బీజేపీ ఒక రాజకీయా అస్త్రంగా వాడుకుంటోందని ఆయనఆరోపించారు. సమాజాన్ని విభజించడానికే దీన్ని ఉపయోగిస్తోందని అన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో వాదనలు కూడా వినిపిస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్నాయకులంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నామని గొగొయ్ తెలిపారు.