ఒక్క మెసేజ్ చేస్తే చాలు.. పదివేలు అకౌంట్‌లో పడిపోతాయి

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావంటూ కొందరు ప్రజలను భయపెడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కొంతమంది వాలంటీర్లు వైసీపీ‌కి ఓట్లు వేయకుంటే ప్రభుత్వ పథకాలు రావని ప్రజలను బెదిరిస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పథకాలు రావని ఎవరైనా వైసీపీ నేతలు కానీ, వాలంటీర్లు కానీ బెదిరింపులకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. సమాచారం అందించడానికి అతను ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ 7557557744 నెంబర్ […]

Update: 2021-03-29 03:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావంటూ కొందరు ప్రజలను భయపెడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కొంతమంది వాలంటీర్లు వైసీపీ‌కి ఓట్లు వేయకుంటే ప్రభుత్వ పథకాలు రావని ప్రజలను బెదిరిస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పథకాలు రావని ఎవరైనా వైసీపీ నేతలు కానీ, వాలంటీర్లు కానీ బెదిరింపులకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. సమాచారం అందించడానికి అతను ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ 7557557744 నెంబర్ ను ప్రకటించారు. ఈ నెంబర్ కు కాల్ రికార్డు కానీ, ఫోటో కానీ వాట్సాప్ చేస్తే ఆ వ్యక్తులకు అకౌంట్ లో రూ.10 వేలు వేస్తామని చెప్పారు. అలాగే లోక్ సభ పరిధిలోని ఏడు నియోజక వర్గాలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. పథకాలు పోతాయి అనే భయం వదిలేసి ఓటర్లంతా టీడీపీ పక్షాన నిలవాలి పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీని గెలిపిస్తే వైసీపీకి బుద్ధి చెప్పినట్టుగా అవుతుందన్నారు.

Tags:    

Similar News