DSC నోటిఫికేషన్ విడుదలైన వేళ కీలక పరిణామం.. వారికి హరిరామ జోగయ్య సంచలన లేఖ
రాష్ట్రంలో మెగా డీఎస్సీ (MEGA DSC)కి నోటిఫికేషన్ విడుదలైన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మెగా డీఎస్సీ (MEGA DSC)కి నోటిఫికేషన్ విడుదలైన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ కురు వృద్ధుడు, కాపు నాయకుడు హరిరామ జోగయ్య (Harirama Jogaiah) ఇవాళ సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లకు సంచలన లేఖ రాశారు. అయితే, ఆ లేఖలో మెగా డీఎస్సీ (Mega DSC)పై ఓ కీలక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. డీఎస్సీ నియామకాల్లో 103 రాజ్యంగ సవరణ ప్రకారం షెడ్యూల్-14 చట్ట ప్రకారం విద్య, ఉద్యోగాల్లో 10 శాతం అగ్రవర్ణాల్లోని EWS కోటాలో కాపు కులస్తులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఆ విషయంలో ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు కూడా అనుమతించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే కాపులకు డీఎస్సీ నియామకాల్లో EWS కోటాలో 5 శాతం రిజర్వేషన్లు కల్పించి కాపు సామాజికవర్గ అభ్యున్నతికి పాటుపడాలని హరిరామ జోగయ్య సీఎం, డీప్యూటీ సీఎంలను కోరారు.