గృహహింస నివారణకు ప్రత్యేక బృందాలు

దిశ, మహబూబ్ నగర్ : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో భార్య భర్తలు ఇంట్లోనే ఉంటున్నందున రాష్ట్రంలోని పలుచోట్ల గృహహింస కేసులు నమోదవుతున్నట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే మహిళల సంరక్షణకు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. బాధిత మహిళల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే షీ బృందాలు నేరుగా వారి ఇంటికి వెళ్లి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని స్పష్టంచేశారు.లాక్‌డౌన్ వలన తమ సమస్యలు […]

Update: 2020-05-17 07:52 GMT

దిశ, మహబూబ్ నగర్ :
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో భార్య భర్తలు ఇంట్లోనే ఉంటున్నందున రాష్ట్రంలోని పలుచోట్ల గృహహింస కేసులు నమోదవుతున్నట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే మహిళల సంరక్షణకు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. బాధిత మహిళల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే షీ బృందాలు నేరుగా వారి ఇంటికి వెళ్లి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని స్పష్టంచేశారు.లాక్‌డౌన్ వలన తమ సమస్యలు చెప్పుకోడానికి బయటకు రాలేని మహిళల కోసం ఈ ప్రత్యేక రక్షణ బృందాలు ఎంతోగానో ఉపయోగపడుతాయని ఎస్పీ వెల్లడించారు.

Tags:    

Similar News