మన ప్రజాస్వామ్యంపై గర్విస్తున్నాం: రవిశంకర్

న్యూఢిల్లీ: భారత్‌లో మితిమీరిన ప్రజాస్వామ్యం కారణంగా కఠిన సంస్కరణలు చేపట్టడం కష్టసాధ్యమన్న నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అమితాబ్ కాంత్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు కేంద్రమంత్రి రవిశంకర్ స్పందిస్తూ.. ‘మన దేశంలోని ప్రజాస్వామ్యంపై గర్విస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌కు దారి పేరిట నిర్వహించిన ఓ సమావేశంలో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ… టూ మచ్ డెమొక్రసీ కారణంగా భారత్‌లో కఠిన సంస్కరణలు […]

Update: 2020-12-09 09:11 GMT

న్యూఢిల్లీ: భారత్‌లో మితిమీరిన ప్రజాస్వామ్యం కారణంగా కఠిన సంస్కరణలు చేపట్టడం కష్టసాధ్యమన్న నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అమితాబ్ కాంత్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు కేంద్రమంత్రి రవిశంకర్ స్పందిస్తూ.. ‘మన దేశంలోని ప్రజాస్వామ్యంపై గర్విస్తున్నాం’ అని స్పష్టం చేశారు.

ఆత్మనిర్భర్ భారత్‌కు దారి పేరిట నిర్వహించిన ఓ సమావేశంలో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ… టూ మచ్ డెమొక్రసీ కారణంగా భారత్‌లో కఠిన సంస్కరణలు తీసుకురావడం క్లిష్టమని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అటువైపుగా అడుగులు వేస్తున్నదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పోస్టుల, మీమ్‌లు పోటెత్తాయి. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అమితాబ్ కాంత్ కూడా వివరణనిచ్చారు.

Tags:    

Similar News