మంజీరా డ్యాంకు నీరు విడుదల
దిశ, ఆందోల్: తాగునీటి అవసరాల కోసం మంజీరా డ్యాంకు సింగూర్ ప్రాజెక్టు నుంచి పవర్ హౌస్ ద్వారా 0.5 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. పవర్ హౌస్ నుంచి 2 గేట్ల ద్వారా 0.5 టీఎంసీల నీటిని రెండు రోజుల పాటు విడుదల చేస్తే 15 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుందన్నారు. 1.5 టీఎంసీల సామర్థ్యం గల మంజీరా బ్యారేజీలో ప్రస్తుతం 0.02 టీఎంసీల ఉందని తెలిపారు. 29.97 టీఎంసీల […]
దిశ, ఆందోల్:
తాగునీటి అవసరాల కోసం మంజీరా డ్యాంకు సింగూర్ ప్రాజెక్టు నుంచి పవర్ హౌస్ ద్వారా 0.5 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. పవర్ హౌస్ నుంచి 2 గేట్ల ద్వారా 0.5 టీఎంసీల నీటిని రెండు రోజుల పాటు విడుదల చేస్తే 15 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుందన్నారు. 1.5 టీఎంసీల సామర్థ్యం గల మంజీరా బ్యారేజీలో ప్రస్తుతం 0.02 టీఎంసీల ఉందని తెలిపారు. 29.97 టీఎంసీల నీటి సామర్థ్యం గల సింగూరులో ప్రస్తుతం 24.522 టిఎంసిల నీటి నిల్వ ఉందని ఆయన వెల్లడించారు.