గోదావరికి జలకళ

దిశ, బోధన్: తెలంగాణకు ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో గోదావరికి జలకళ సంతరించుకుంది. నిన్నటి వరకు ఇసుల తిన్నెలతో దర్శనమిచ్చిన గోదావరిలో మంగళవారం నుంచి వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తిలో బాబ్లీ ప్రాజెక్ట్ వరద నీరు తెలంగాణలోకి ప్రవేశిస్తోంది. దీంతో గోదావరి నదిలో వరద క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కొత్త నీరు వచ్చి చేరుతున్నది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కందకుర్తి త్రివేణి సంగమం క్షేత్రం […]

Update: 2021-06-15 04:02 GMT

దిశ, బోధన్: తెలంగాణకు ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో గోదావరికి జలకళ సంతరించుకుంది. నిన్నటి వరకు ఇసుల తిన్నెలతో దర్శనమిచ్చిన గోదావరిలో మంగళవారం నుంచి వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తిలో బాబ్లీ ప్రాజెక్ట్ వరద నీరు తెలంగాణలోకి ప్రవేశిస్తోంది. దీంతో గోదావరి నదిలో వరద క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కొత్త నీరు వచ్చి చేరుతున్నది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కందకుర్తి త్రివేణి సంగమం క్షేత్రం కొత్త వీటితో కళకళలాడుతోంది.

Tags:    

Similar News