అద్భుతం ఈ చిత్రం.. కళ్ళను కట్టిపడేసే అందం

దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: చుట్టూ నీరు, పరిసరాల్లో చెట్లు, చల్లని వాతావరణం, మధ్యలో 38 అడుగుల ఎతైన గంగాధరుడు, పొంగుతున్న నెలవంక, అటుగా మధ్యలో దారి చూపరుల. వనపర్తి జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కొత్తకోట మండలం పామాపురం వద్ద ఊకచెట్టు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‌కు వరద నీరు చేరి అద్భుతంగా అలుగు పారుతుంది. చెక్ డ్యామ్ నిండుగా నీటితో జలకళ సంతరించుకుంది. చెక్ డ్యామ్‌లో నిర్మించిన 38 […]

Update: 2020-07-19 04:57 GMT

దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: చుట్టూ నీరు, పరిసరాల్లో చెట్లు, చల్లని వాతావరణం, మధ్యలో 38 అడుగుల ఎతైన గంగాధరుడు, పొంగుతున్న నెలవంక, అటుగా మధ్యలో దారి చూపరుల. వనపర్తి జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కొత్తకోట మండలం పామాపురం వద్ద ఊకచెట్టు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‌కు వరద నీరు చేరి అద్భుతంగా అలుగు పారుతుంది. చెక్ డ్యామ్ నిండుగా నీటితో జలకళ సంతరించుకుంది. చెక్ డ్యామ్‌లో నిర్మించిన 38 అడుగుల శివుడి విగ్రహం నీటిలో చూపరులను ఆకట్టుకుంటుంది. భవుడి అందం చూడటానికి రెండు కళ్లు చాలవంటున్నారు చూపరులు. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. అయితే గతంతో పోల్చితే ఈ సారి కరోనా కారణంగా ఆశించిన మేర మాత్రం ప్రజలు రావడం లేదనే చెప్పాలి.

Tags:    

Similar News