జీహెచ్‌ఎంసీ పార్కులో వాచ్‌మెన్ పెత్తనం

  దిశ, కూకట్​పల్లి: ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాల్సిన పార్కులో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం కొనసాగుతుంది. మూసాపేట్​ సర్కిల్​ పరిధి కేపీహెచ్​బీ డివిజన్​ మూడవ ఫేజ్‌లో ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కును ప్రజలు వినియోగించుకోవాలంటే భయపడుతున్నారు. పార్కు కాపలాగ ఉన్న వాచ్‌మెన్​ పార్కులోని గదిలో నివాసం ఉంటూ పార్కును పూర్తిగా తన సొంత ఆస్థిలా వినియోగించుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్కు బాగోగులు చూసుకోవలసిన వాచ్‌మెన్​పార్కు అధ్వాన్నంగా తయారైన పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. అదే […]

Update: 2021-08-30 07:46 GMT

 

దిశ, కూకట్​పల్లి: ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాల్సిన పార్కులో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం కొనసాగుతుంది. మూసాపేట్​ సర్కిల్​ పరిధి కేపీహెచ్​బీ డివిజన్​ మూడవ ఫేజ్‌లో ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కును ప్రజలు వినియోగించుకోవాలంటే భయపడుతున్నారు. పార్కు కాపలాగ ఉన్న వాచ్‌మెన్​ పార్కులోని గదిలో నివాసం ఉంటూ పార్కును పూర్తిగా తన సొంత ఆస్థిలా వినియోగించుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పార్కు బాగోగులు చూసుకోవలసిన వాచ్‌మెన్​పార్కు అధ్వాన్నంగా తయారైన పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. అదే విధంగా పార్కు ప్రధాన గేటు ఎదురుగా రోడ్డు వరకు పెద్ద పెద్ద​ రాళ్లు పెట్టి ఎవరూ వాహనాలు పార్కింగ్​ చేయకుండా అడ్డు పడుతున్నాడని, అడగడానికి వెళ్లితే గొడవ పెట్టుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా పార్కు ఆవరణలో తమ ఇంటి సామాన్లు, బెంచీలు, చెట్లకు ఇంట్లో దుప్పట్లు ఆరబెట్టుకోవడానికి వినియోగించుకుంటున్నారు.

అంతే కాకుండా పార్కులోని బోర్​ నీటిని బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితాలతో అలసిన వారు సేదతీరడానికి కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న పార్కులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News