ఒడిషా జట్టు కోచ్‌గా వసీం జాఫర్
దిశ, స్పోర్ట్స్: ఒడిషా క్రికెట్ జట్టు కోచ్‌గా టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ నియమితులయ్యారు. ఒడిషా జట్టుకు రాబోయే రెండు సీజన్ల పాటు చీఫ్ కోచ్‌గా సేవలు అందిస్తారని తెలుస్తున్నది. వసీం జాఫర్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఉత్తరాఖండ్ జట్టుకు కోచ్‌గా నియమించబడ్డాడు. అయితే జట్టు ఎంపికపై జాఫర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అతడు బయటకు వచ్చేశాడు. జాఫర్‌ను కోచ్‌గా నియమించడానికి గత కొన్ని రోజులుగా దేశవాళీ క్రికెట్ జట్లు ప్రయత్నాలు […]
దిశ, స్పోర్ట్స్: ఒడిషా క్రికెట్ జట్టు కోచ్‌గా టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ నియమితులయ్యారు. ఒడిషా జట్టుకు రాబోయే రెండు సీజన్ల పాటు చీఫ్ కోచ్‌గా సేవలు అందిస్తారని తెలుస్తున్నది. వసీం జాఫర్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఉత్తరాఖండ్ జట్టుకు కోచ్‌గా నియమించబడ్డాడు. అయితే జట్టు ఎంపికపై జాఫర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అతడు బయటకు వచ్చేశాడు. జాఫర్‌ను కోచ్‌గా నియమించడానికి గత కొన్ని రోజులుగా దేశవాళీ క్రికెట్ జట్లు ప్రయత్నాలు చేశాయి. చివరకు ఒడిషా జట్టు అతడిని కోచ్‌గా నియమించుకున్నది.
ఈ విషయాన్ని ఒడిషా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంజయ్ బెహరా ఒక ప్రకటనలో తెలిపారు. ‘జాఫర్ జట్టు కోచ్‌గా రావడం వల్ల ఒడిషా క్రికెటర్లకు మంచి జరుగుతుంది. దేశవాళీ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన జాఫర్ తమ క్రికెటర్లకు మెలకువలు నేర్పడంలో తప్పక సాయపడతారు. అతడు రావడం వల్ల క్రికెటర్లు ఉత్సాహంగా ఉన్నారు’ అని సంజయ్ బెహరా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.