విద్యార్థి సంఘాలపై వరంగల్ పోలీసుల ఫోకస్
దిశ ప్రతినిధి, వరంగల్: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. గత నెల 26న కేయూ విద్యార్థి బోడ సునీల్ పురుగులమందు తాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సునీల్ మృతితో వరంగల్ అర్బన్ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సునీల్ మరణవార్త తెలియగానే మంత్రి […]
దిశ ప్రతినిధి, వరంగల్: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. గత నెల 26న కేయూ విద్యార్థి బోడ సునీల్ పురుగులమందు తాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సునీల్ మృతితో వరంగల్ అర్బన్ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సునీల్ మరణవార్త తెలియగానే మంత్రి ఎర్రబెల్లి ఇంటిని టీజీవీపీ, ఏబీఎస్ఎఫ్, డీఎంఎస్‌ఏ, పీడీఎస్‌యూ, ఎన్ఎస్‌యూఐ, కేయూ జాక్ నాయకులు నేతలు ముట్టడికి యత్నించారు. వీరిని కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది విద్యార్థి సంఘం నేతలు మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని రహస్య ప్రాంతాల్లో ఉంటునట్లుగా సమాచారం. ఈ పరిణామాలతో విద్యార్థి సంఘాల నాయకుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచినట్లుగా తెలుస్తోంది.